భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అనే విషయం తెలిసిందే. కానీ విరాట్ కోహ్లీ మన మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ కు పెద్ద ఫ్యాన్. ఈ దాదాపు ఎవరికీ తెలిసి ఉండదు. ఎందుకంటే.. ఈ విషయాన్ని తాజాగా కోహ్లీ స్నేహితుడు బయటపెట్టాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్న విరాట్ కోహ్లీ.. అక్కడ తన చిన్ననాటి మిత్రుడు… తెలుగు క్రికెటర్ ద్వారక రవితేజను కలుసుకున్నాడు. ఇక అక్కడ వారిద్దరూ దిగ్గిన ఫోటోను రవితేజ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కోహ్లీతో ఉన్న కొన్ని మూమెంట్స్ ను పంచుకున్నాడు.
Advertisement
మేము ఇద్దరం.. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత కలుసుకున్నాం. అయితే కోహ్లీ నన్ను చూసినా వెంటనే.. ఏ చిరు ఎలా ఉన్నావు? అని పలకరించాడు. ఆలా ఎందుకు అంటే.. నేను, విరాట్ కోహ్లీ అండర్-15 క్రికెట్ ఆడుతున్నపుడు… రూమ్మేట్స్గా ఉన్నం. ఆ సమయంలో నేను ఎక్కువగా.. మెగాస్టార్ చిరంజీవి సాంగ్స్‌ను చూసేవాడిని. అప్పుడు కోహ్లీ కూడా చిరంజీవి పాటలకు, డ్యాన్స్ కు ఫ్యాన్ అయిపోయి తెగ డ్యాన్స్ చేసేవాడు. ఇక అప్పటి నుండి మేము ఇద్దరం మా పేర్లతో కాకుండా.. చిరు, చిరు అని పిలుచుకోవడం ప్రారంభించాము.
Advertisement
ఇక ఇన్ని సంవత్సరాలు అయిన ఆ అనుభూతులు అలాగే ఉన్నాయి. అసలు ఏం మారలేదు. నిన్ను కలవడం సంతోషంగా ఉంది. మళ్ళీ తొందరలోనే కలుస్తాం అని అనుకుంటున్నాను అని ద్వారక రవితేజ పేర్కొన్నాడు. ఇక ఈ విషయం తెలుసుకుని చిరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దీనిని తెగ షేర్ చేస్తున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్ కోల్పోవడం వల్ల పరుగులు చేయడనికి ఇబ్బంది పడుతున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో గాయం కారణంగా అతను ఆడలేకపోయాడు.
ఇవి కూడా చదవండి :