Telugu News » Viral video : వార్నీ… పెళ్ళిలోనే ముద్దులు…అందరూ చూస్తుండగానే..!

Viral video : వార్నీ… పెళ్ళిలోనే ముద్దులు…అందరూ చూస్తుండగానే..!

by AJAY MADDIBOINA

ఒకప్పుడు పెళ్లిచూపులు జరిగిన తర్వాత మళ్లీ పెళ్లి లోనే అబ్బాయి అమ్మాయి చూస్కునేవారు. కొంతమంది సంప్రదాయం ప్రకారం పెళ్లిలో కూడా చూడడం కుదిరేది కాదు. కానీ ఇప్పుడు సంప్రదాయాలు అన్నీ మారిపోయాయి. పెళ్లిచూపులు జరిగాయంటే ఒకరి ఫోన్ నెంబరు మరొకరు మార్చుకోవడం ఆ తర్వాత తరచూ ఫోన్ లో మాట్లాడుకోవడం, చాటింగ్ చేయడం కనిపిస్తోంది. అంతే కాకుండా పెళ్లి చూపులు అయిన వెంటనే ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడం.. సినిమాలకు షికార్లకు తిరగడం కూడా కామన్ అయిపోయింది.

Ads

ఇక ఇప్పుడు జనరేషన్ అలాగే ఉందని తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం మానేశారు. మరోవైపు డేటింగ్ కల్చర్ కూడా పెరిగిపోయింది. దాంతో పెళ్లికి ముందే చాలా మంది కలిసి ఉంటున్నారు. అయితే ఏది ఏమైనా పెళ్లి జరిగే సమయం లో మాత్రం సంప్రదాయాలు పాటించాల్సిందే. కానీ తాజాగా ఓ వరుడు పెళ్లి జరుగుతుండగానే వధువుకు ముద్దు పెట్టేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియోలో పెళ్లి జరుగుతున్న సమయంలోనే వరుడు వధువు కి ముద్దు పెట్టాడు.

 

వధువు కూడా తమ పెళ్లి జరుగుతుందని మండపం లో ఉన్నామని మర్చిపోయిందో ఏమో గానీ ఎవరినీ పట్టించుకోలేదు. అయితే క్రిస్టియన్ మ్యారేజ్ లలో ముద్దులు పెట్టుకోవడం ఉంటుంది గానీ హిందూ సాంప్రదాయం లో అలాంటివి ఉండవు. కానీ హిందూ వివాహం లో వరుడు రెచ్చిపోయి వధువుకు ముద్దు పెట్టడంతో ఇప్పుడు నెట్టింట ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోకు ఒక్కరోజు ఆగలేకపోయారా బ్రో అంటూ కొంతమంది కామెంట్లు పెడుతుండగా…మరి కొందరు ఈ రోజుల్లో అవన్నీ కామన్ అయ్యాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

https://www.instagram.com/reel/CXQ1Uz_l0Nm/?utm_medium=copy_link


You may also like