Telugu News » Blog » Viral video : ఈ కుక్క బతుకే చాలా బెటర్…!

Viral video : ఈ కుక్క బతుకే చాలా బెటర్…!

by AJAY
Ads

మనం మాములుగా ఎవరినైనా తిట్టడానికి ‘ఛీ ఇదేం బతుకురా కుక్క బతుకు’ అని తిడుతుంటాం.ఎందుకంటే కుక్కలకు ఎలాంటి మనోభావాలు అనేవి ఉండవు, వాటికి హక్కులు లేవని, అవి ఎదురించలేవనే ధైర్యంతోనే మనిషి ఇలా మాట్లాడుతాడు. అయితే కొన్ని కుక్కల రాజభోగాలు చూస్తే ఖచ్చితంగా మన అభిప్రాయాన్ని తప్పకుండ మార్చుకుంటాం. మనుషుల కంటే లగ్జరీగా ఇంకా చాలా ఎంజాయ్‌ చేస్తూ గడుపుతుంటాయి. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్లు శునకాల యజమానులు వాటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు.

Advertisement

Advertisement

శునకాలను ఇంటిలో సభ్యులిగా భావిస్తూ వాటికి తమతో సమానమైన గౌరవాన్ని, అవసరాలను తీరుస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ పెంపుడు శునకాలకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ కుక్కకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే Chipheregirl అనే TikTok అకౌంట్‌ నుంచి పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఓ శునకం యజమాని దానికోసం ప్రత్యేకంగా ఓ ఇంటినే నిర్మించారు. ఇందులో శునకం కోసం ఓ టీవీ, పర్సనల్‌ బెడ్‌, ఫ్రిడ్జ్‌తో పాటు సకల సౌకర్యాలను దానికి అందుబాటులో ఉంచారు. క్రిస్మస్‌ దగ్గర పడుతోన్న నేపథ్యంలో ఇంటిని కూడా చూడ ముచ్చటగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ‘ఆహా.. ఈ కుక్కకు ఎంత అదృష్టం’, ‘మీ శునకానికి రూమ్‌మేట్ అవసరం ఉంటే చెప్పండి’, అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

https://www.instagram.com/reel/CXJRNC4J2Xo/?utm_source=ig_web_copy_link