సాధారణంగా సెలెబ్రెటీలకు ఎంత క్రేజ్ ఉంటుందనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఒక్కసారి ప్రేక్షకుల్లో తమ టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకుంటే చాలు. ఇక ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు. ఇక ఒక్కసారిగా ఓవర్ నైట్ సెలెబ్రెటీగా మారిపోవడమే కాదు. ఇక మొత్తం కొత్త లైఫ్ అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే మామూలుగా మనం ఎన్నో రకాల సంగీత కచేరీలను చూసి ఉంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది కాబట్టి ఇటువంటి వీడియోలు మనకు వేలాదిగా దర్శనమిస్తుంటాయి. ఇలా సంగీత కచేరీలో పాల్గొన్న ఓ సింగర్ వీడియో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇక వీడియో ఎందుకలా వైరల్ గా మారింది.. అందులో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా. అయితే మీరు ఇది చదవాల్సిందే. తమకిష్టమైన గాయని కచేరీ నిర్వహిస్తుండటంతో ఇక ఫ్యాన్స్ తమ అభిమానాన్ని అపుకోలేక పోయారు. ఏకంగా కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన శ్రీసమస్త్ హరిద్వార్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కచేరీకి ప్రముఖ జానపద గాయని ఊర్వశి రాధాదియా హాజరయ్యారు. ఇక ఆమె నిర్వహిస్తున్న కచేరీకి అక్కడున్న ఫ్యాన్స్ మంత్ర ముగ్ధులవడమే కాక ఆమెపై నోట్ల వర్షం కురిపించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా కరెన్సీ నోట్లతో నిండి పోయింది. అయితే తన చుట్టూ అభిమానులు ఇంత హంగామా సృష్టిస్తున్నా తన కచేరీని మాత్రం ఆమె ఆపలేదు.అయితే జానపద పాటలు ఆలపించడంలో ఊర్వశి రాధాదియాకి గుజరాత్ రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది. ఓ సింగర్ పై ఇంతలా అభిమానులు తమ అభిమానం చూపించిన ఘటనలు ఇది వరకు ఎప్పుడూ లేదు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అభిమాణనిస్తే ఇంతలా తమ అభిమానాన్ని చాటుకుంటారా అంటూ నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నెట్టింటిని షేక్ చేస్తున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం. చూసేయండి మరి.
Advertisement
Advertisement
watch video:
View this post on Instagram
Advertisement