Home » VIRAL VIDEO : కోతికి సీపీఆర్…అంజ‌న్నా అంటూ మ‌ళ్లీ ఊపిరిపోశాడు …!

VIRAL VIDEO : కోతికి సీపీఆర్…అంజ‌న్నా అంటూ మ‌ళ్లీ ఊపిరిపోశాడు …!

by AJAY
Ad

మనిషి గుండె కొట్టుకోవడం ఆగిపోతే వెంటనే సిపిఆర్ చేస్తే బ్రతికే అవకాశం ఉంది. అలా గుండె ఆగిపోయిన వ్యక్తులకు సిపిఆర్ చేసి బ్రతికించిన సంధ‌ర్బాలు ఎన్నో ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట చాలా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి కోతికి సిపిఆర్ చేసి దానిని బ్రతికించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. కోతికి యాక్సిడెంట్ చేశారా లేదంటే ఏదైనా ప్రమాదం జరిగి గాయపడిందా అన్న‌ది తెలియదుగానీ వీడియో లో వ్యక్తి మాత్రం దానికి సిపిఆర్ చేసి మళ్లీ ఊపిరి పోశాడు.

Advertisement

Advertisement

రోడ్డు పై ఒక వ్యక్తి స్పృహ కోల్పోయిన కోతి ఛాతి భాగంలో చేతులను పెట్టి గట్టిగా అదుముతూ సిపిఆర్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ ఆ కోతి కళ్ళు తెరవలేదు. దాంతో ఆ వ్యక్తి అంజన్నా.. అంజన్నా అంటూ కోతి నోట్లో నోరు పెట్టి గట్టిగా అరుస్తున్నాడు. అలా చాతి పై అదుముతూ ఊపిరి అందించడంతో కోతి ఒక్కసారిగా స్పృహ‌లోకి వచ్చింది. దాంతో సిపిఆర్ చేసిన వ్యక్తి ఎంతో ఆనందపడ్డాడు. అంజన్నా అంజన్నా అంటూ కేకలు వేశాడు.

హిందూ పురాణాల ప్రకారం కోతి ని హనుమంతుడుగా భావిస్తారన్న‌ సంగతి తెలిసిందే. అందువల్లే ఆ వ్యక్తి కోతిని అంజన్న అని పిలుస్తూ దానికి సీపీఆర్ చేశాడు. ఇక ప్రస్తుతం కోతికి సిపిఆర్ చేసిన వీడియో వైర‌ల్ అవుతోంది. దాంతో ఆ వ్యక్తి చేసిన ప‌నికి నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మనుషుల్లో కూడా కొంతమంది మహానుభావులు ఉంటారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading