Home » చరిత్రనే మార్చేసిన ముగ్గురు నేతల అరుదైన కలయిక.. వైరల్ అవుతున్న ఫోటో..!

చరిత్రనే మార్చేసిన ముగ్గురు నేతల అరుదైన కలయిక.. వైరల్ అవుతున్న ఫోటో..!

by Srilakshmi Bharathi
Ad

ఈ కింద కనిపిస్తున్న ఫోటో చూసారా? ఇందులో చరిత్రనే మార్చేసిన ముగ్గురు నేతలు ఉన్నారు. వారెవరో కాదు.. సినీ నటుడు M.G.రామచంద్రన్, పి. వి.నరసింహారావు, మాజీ ఏపీ సీఎం ఎన్టీ రామారావులు. వీరు ముగ్గురు కలిసి లంచ్ చేస్తున్న సమయంలో తీసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ ప్రత్యేక సందర్భంలో పి.వి.నరసింహారావు చెన్నై కు వెళ్లారట. ఆ సమయంలో ఎన్టీ రామారావు ఆయనను తన ఇంటికి ఆహ్వానించారట.

Advertisement

ఎం జి రామ చంద్రన్ ను కూడా రామారావే ఆహ్వానించారట. వీరిద్దరూ సన్నిహితులన్న సంగతి విదితమే. రామ చంద్రన్ రామారావు కు సినిమా పరిశ్రమలో సన్నిహితుడు. అలా ముగ్గురు ఒకేసారి కలిసారుట. సంస్కృతి, సంప్రదాయం పట్ల వారికి ఉన్న గౌరవం, వారి మధ్య ఉన్న బంధం ఈ ఫొటోలో కనిపిస్తాయి. టేబుల్ పై కూర్చుని భోజనం చేసే దర్పం కంటే.. వారు సామాన్యంగా సంప్రదాయం ప్రకారం కింద చాపపై కూర్చుని.. ఫోర్క్స్, స్పూన్స్ కి బదులుగా చేతితో భోజనం చేయడానికే ఆసక్తి చూపారు.

Advertisement

సినిమాలు, రాజకీయాల నుంచి.. సామాజిక, వ్యక్తిగత సమస్యల వరకు అన్ని విషయాలను వీరు ఆ సమయంలో చర్చించుకున్నారట. తమ అభిప్రాయాలను, అనుభవాలను ఆ సందర్భంగా ఒకరినొకరు పంచుకున్నారు. సమాజానికి వారందంచిన సేవలను కూడా ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ అభినందనలు తెలుపుకున్నారు. ప్రధాని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఓ చోట చేసిన ఈ విందు అప్పట్లో ఓ మరపురాని సంఘటనగా నిలిచింది. పి.వి.నరసింహారావు 1991లో భారతదేశానికి ప్రధానిగా ఎన్నుకోబడ్డ సంగతి విదితమే. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన రామారావు 1983 లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎం.జి.రామచంద్రన్ కూడా రాజకీయాల్లోకి వచ్చి 1972లో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం లో చేరి 1977 లో తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇటువంటి అరుదైన ఫోటోలు.. అప్పట్లో మనుషులు ఎలా ఉండే వారు అన్న విషయాలపై అవగాహనను కలిగిస్తాయి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading