బాహుబలి సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ గా ఉంటున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తరువాత వచ్చిన ప్రభాస్ సినిమాలు ఏవీ బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్ కాలేదు. సాహో సినిమా యావరేజ్ గా నిలిస్తే.. రాధేశ్యామ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎన్నో అంచనాల తరువాత విడుదల అయిన ఆదిపురుష్ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రభాస్ లుక్స్ పై కూడా చాలా నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. కానీ ప్రభాస్ రేంజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు.
Advertisement
సెప్టెంబర్ 28 న ప్రభాస్ “సలార్” సినిమా విడుదల కాబోతోంది. దీనికోసం ప్రభాస్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ గురించి వైరల్ అవుతున్న వార్తా ప్రభాస్ ఫాన్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రభాస్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు అన్నది ఈ వార్తల సారాంశం. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ప్రభాస్ చాలా కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారట.
Advertisement
సలార్ సినిమా షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాక ప్రభాస్ కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి ట్రీట్ మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారని ఈ వార్తల సారాంశం. ప్రభాస్ మోకాలికి ఆపరేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయని.. గత కొంతకాలంగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ సినిమాల నుంచి కొంత బ్రేక్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకోనున్నారని చెప్తూ ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. వీటి గురించి ఎటువంటి అఫీషియల్ అనౌన్సమెంట్ కూడా లేకపోవడంతో ప్రభాస్ ఫాన్స్ లో ఆందోళన మొదలైంది. ప్రభాస్ ఆరోగ్యంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు.
మరిన్ని..
“బోళా శంకర్” సినిమా అట్టర్ ఫ్లాప్… సుస్మిత పై ఫ్యాన్స్ సీరియస్ ?
అక్కినేని నాగార్జునకు రైతు బంధు…ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు
భోళా శంకర్ అట్టర్ ఫ్లాఫ్.. భారత్‌దే వరల్డ్ కప్.. ఇదే సెంటిమెంట్..!