సాధారణం ఏదైనా ఒక సినిమా హిట్ అయితే మాత్రం కొద్ది రోజుల వరకు దాని మ్యానియాలోనే ఉండిపోతుంటారు అభిమానులు. పుష్ప విడుదలైన తరువాత తగ్గేదేలే.. పార్టీ లేదా పుష్ప అని ఆరంభించారు. ఆ తరువాత భీమ్లానాయక్ విడుదలయ్యాక మనల్ని ఎవడ్రా ఆపేది అని.. ఆర్ఆర్ఆర్ డైలాగ్స్ అయితే ఇక చెప్పనవసరమే లేదు. తాజాగా అభిమానులందరూ కేజీఎఫ్ 2 మ్యానియాలో పడిపోయారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వయలెన్స్ డైలాగ్‌ను వాడేస్తున్నారు.
Advertisement
సినిమా విడుదలైన తరువాత ఆ డైలాగ్ వాడకం పెరిగినదనే చెప్పాలి. బాలీవుడ్ హీరో సంజయ్‌దత్‌తో ఫైట్ తర్వాత యష్ వయలెన్స్ వయలెన్స్.. వయలెన్స్ ఐడోంట్ లైక్ ఇట్.. బట్ వయలెన్స్ లైక్స్ మి.. ఐకాంట్ అవైడ్ ఇట్ అని పవర్ ఫుల్‌గా చెబుతాడు. ఈ డైలాగ్ కు థియేటర్‌లో ఈలలు మామూలుగా పడలేదు. నిజజీవితంలో కూడా ఏదైనా నచ్చక చేసే పని ఉంటే అందరూ ఈ డైలాగ్‌ను ఉపయోగించేస్తున్నారు. ఇక ఈ డైలాగ్‌తోనే ఎన్ని మీమ్స్ వచ్చాయో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
Advertisement
తాజాగా ఓ యువకుడు ఏకంగా తన పెళ్లి కార్డులో వయలెన్స్ డైలాగ్ వాడడం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. కర్ణాటకలోని బెళగావికి చెందిన చంద్రశేఖర్ పెళ్లి కార్డు చివర మ్యారేజ్.. మ్యారేజ్.. మ్యారేజ్ ఐడోంట్ లైక్ ఇట్, ఐ అవైడ్ బట్, మై రిలేటివ్స్ లైక్ మ్యారేజ్. ఐకాంట్ అవైడ్ అని కార్డు ప్రింట్ చేయించాడు. ఇన్‌డైరెక్ట్‌గా పెద్దల బలవంతంతో పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదెక్కడి వెడ్డింగ్ కార్డు రా బాబు అని కొందరు.. నువ్వు ధైర్యంగా చెప్పావ్.. మేమ చెప్పలేదు బ్రదర్ అని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ నిజ జీవితంలో సినిమా డైలాగ్‌ల ప్రభావం ఎక్కువగానే ఉందని ఈ వెడ్డింగ్ కార్డుతో అర్థమవుతోంది.
ఇవి కూడా చదవండి :
- కేజీఎఫ్ దర్శకుడు తెలుగు వాడేనా..? వైరల్ అవుతున్న ప్రశాంత్ నీల్ కామెంట్స్..!
- కేజీఎఫ్-2 ఇనాయత్ కలీల్ ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ తండ్రి అన్న సంగతి తెలుసా…!
- ఆ మాజీ మంత్రికి ప్రశాంత్ నీల్ దగ్గరి బంధువు అన్న సంగతి తెలుసా ….!