Home » నా సోదరుడికి అంత చేస్తే వాడే నన్ను చంపడానికి అలా చేశాడు… చివరికి చిరంజీవి… పొన్నంబలం..!

నా సోదరుడికి అంత చేస్తే వాడే నన్ను చంపడానికి అలా చేశాడు… చివరికి చిరంజీవి… పొన్నంబలం..!

by AJAY
Ad

ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో భాషల సినిమాల్లో ఎక్కువ శాతం విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన పొన్నంబలం ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన తన జీవితానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

 

Advertisement

తాజా ఇంటర్వ్యూలో భాగంగా పొన్నంబలం మాట్లాడుతూ … నేను జిమ్నాస్టిక్స్ లో మొదటగా పర్ఫెక్ట్ అయ్యాను. దానితో నాకు తమిళ సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అలా కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన అవకాశాలు వస్తున్న సమయంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఘరానా మొగుడు సినిమాలో అవకాశం వచ్చింది. లక్ష రూపాయల రెమినరేషన్ ఇస్తేనే చేస్తాను అన్నాను. కానీ వారు చిరంజీవి లాంటి హీరో సినిమాకు అంత అడుగుతావా అన్నారు.

 

Advertisement

దానితో నేను మొదట నేను యాక్ట్ చేస్తాను. అది నచ్చితేనే మీరు రెమ్యూనరేషన్ ఇవ్వండి అన్నాను. నాలుగు రోజులు నాపై షూటింగ్ చేశారు. అది అద్భుతంగా వచ్చింది. ఒక లక్ష రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేశారు. ఆఫీస్ కి వెళ్తే ఐదు లక్షలు ఇచ్చారు. అది నాకు కాదేమో అనుకుని ఫోన్ చేస్తే అది మీకే చిరంజీవి గారు ఇచ్చారు అని అన్నారు. ఇలా నేను అద్భుతమైన స్థాయిలో ఎదుగుతుండడంతో నా సోదరుడే నాకు స్లో పాయిజన్ ఇచ్చాడు. దానితో నా రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి.

 

ఇలా నా సోదరుడు నాకు స్లో పాయిజన్ ఇస్తున్నాడు అనే విషయం కూడా తెలియక నేను వాడి ఎదుగుదల కోసం వాడికి ఉద్యోగం కూడా ఇప్పించాను. అయినప్పటికీ వాడు కృతజ్ఞత లేకుండా అలా చేశాడు. అలా నేను కిడ్నీ సమస్యతో బాధపడుతూ చికిత్సకు కూడా డబ్బులు లేని సమయంలో చిరంజీవి నాకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కోసం 50 లక్షల వరకు ఖర్చు చేశాడు అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా పొన్నంబలం చెప్పుకొచ్చాడు.

Visitors Are Also Reading