Home » విలన్ దేవరాజ్ రాజ్ భార్య ఆ అందమైన హీరోయిన్ అన్న సంగతి తెలుసా…?

విలన్ దేవరాజ్ రాజ్ భార్య ఆ అందమైన హీరోయిన్ అన్న సంగతి తెలుసా…?

by AJAY
Published: Last Updated on
Ad

సినిమా ఇండస్ట్రీలో తోటి నటీనటులనే పెళ్లి చేసుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది గురించి బయటకు తెలిస్తే మరి కొంతమందికి గురించి మాత్రం పెద్దగా తెలియదు. ఇక టాలీవుడ్ లో విలన్ పాత్రలతో మెప్పిస్తున్న నటుడు దేవరాజ్ భార్య కూడా ఓ హీరోయిన్ అన్న విషయం చాలామందికి తెలియదు. నిజానికి దేవరాజ్ బెంగళూరులోని రామలింగాపురం గ్రామంలో జన్మించాడు.

Advertisement

మొదట దేవరాజ్ హెచ్ఎంటిలో 9 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాడు. సినిమాలపై ఉన్న ఆసక్తితో దేవరాజ్ ను తన సన్నిహితులు నాటకాల్లో ప్రయత్నించమని తెలిపారు. దాంతో మొదట దేవరాజ్ నాటకాల్లో నటించడం ప్రారంభించాడు. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకున్నాడు. మొదట కన్నడలో త్రిశూల అనే సినిమాలో దేవరాజ్ నటించాడు.

Advertisement

కానీ ఈ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత 27 మా వల్లి సర్కిల్ అనే సినిమాలో నటించగా ఈ సినిమా విడుదల అయింది. ఆ తరవాత తెలుగు తో పాటు పలు కన్నడ సినిమాల్లో అవకాశాలను అందుకున్నాడు. మొత్తంగా దేవరాజ్ 200 లకు పైగా సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో నేటి భారతం, సమరసింహారెడ్డి లాంటి చిత్రాలతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడ్డానికి భయంకరంగా ఉండటంతో దేవరాజ్ కు విలన్ గానే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. కొన్ని సినిమాలలో పాజిటివ్ రోల్స్ చేసినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అంతేకాకుండా ఒకప్పుడు కన్నడ నాట హీరోగాను దేవరాజ్ సినిమాలు చేశాడు. అక్కడ పలు సూపర్ హిట్లర్ సైతం అందుకున్నాడు అయితే తెలుగు వారికి మాత్రం విలన్ గానే దేవరాజ్ ఎక్కువగా సుపరిచితుడు.

ఇక దేవరాజ్ ఫ్యామిలీ విషయానికి వస్తే తనకు ఓ సినిమాలో జోడిగా నటించిన హీరోయిన్ చంద్రలేఖను ప్రేమించాడు. కొంతకాలం పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రణవ్, ప్రజ్వల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరూ సైతం సినిమాల్లో నటిస్తున్నారు. ఇక చివరగా దేవరాజ్ భరత్ అనే నేను చిత్రంలో నటించాడు. ప్రస్తుతం కన్నడ తో పాటు తెలుగులో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

Also Read:  మహేష్ బాబు చేసే కసరత్తులు ఆ సినిమా కోసమేనా ?

Visitors Are Also Reading