Home » అదేంటండి అంత మాట అనేసారు ?? RRR లో ఎన్టీఆర్ గురించి ఇలా అన్నారు ఏంటి ?

అదేంటండి అంత మాట అనేసారు ?? RRR లో ఎన్టీఆర్ గురించి ఇలా అన్నారు ఏంటి ?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా మల్టీస్టార్ సినిమాగా రూపొందిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంత కాలం అవుతున్నా ఇంకా ఈ సినిమాలో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అన్న ఫ్యాన్ వార్స్ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ ఈ వార్ కి మరింత ఆజ్యం పోసినట్లయింది.

vijayendra-prasad

Advertisement

 

ఎన్నో అంచనాలతో విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా.. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్ వంటి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు గ్లోబల్ స్టార్లుగా పేర్లు తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్ వార్స్ మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో ఓ సారి విజయేంద్ర ప్రసాద్ తనకు రామ్ చరణ్ రోల్ నచ్చింది అంటూ కామెంట్ చేయడంతో ఫ్యాన్ వార్స్ ఎక్కువ అయ్యాయి. ఆయన తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ నే చేసారు.

Advertisement

ఓ పాత్రని ఎక్కువ, ఓ పాత్రని తక్కువ చేయాలనీ అనుకోలేదని.. కథ రాసినప్పుడు రెండు పాత్రలు ఒకేలా ఉన్నాయని.. కానీ సినిమా తీసిన తరువాత వేరేగా ఉందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని.. ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం ఉంటుందని అన్నారు. ఎన్టీఆర్ గొప్ప నటుడని, ఎలాంటి పాత్ర ఇచ్చిన చేయగలదని.. కానీ ఆర్ ఆర్ ఆర్ లో పాత్ర మాత్రం కష్టం అయిందనీ.. ఆ రోల్ కథని నడిపించడంలో సపోర్టింగ్ గా ఉంటుందని అన్నారు. రామ్ చరణ్ పాత్రని రాముడిలా చూపించాలని అనుకోలేదని, రామరాజు లానే చూపించమని.. కానీ అది రాముడిలా వచ్చిందనీ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading