Home » చిరంజీవితో దాదాపు 20 ఏళ్లు ఎందుకు మాట్లాడ‌లేదో వెల్ల‌డించిన విజ‌య‌శాంతి..!

చిరంజీవితో దాదాపు 20 ఏళ్లు ఎందుకు మాట్లాడ‌లేదో వెల్ల‌డించిన విజ‌య‌శాంతి..!

by Anji
Ad

1980లలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్ జోడి అంటే మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతిలదే. చిరుతో అప్పటి తరం హీరోయిన్స్ రాధా, సుహాసిని, రాధిక, మాధవి, సుమలత, భానుప్రియ లాంటివారు వరుసగా సినిమాలు చేశారు. వీరందరూ చిరుకు మంచి పేయిర్.. సూపర్ హిట్ పేయిర్. ఈ హీరోయిన్స్ అందరితోనూ మెగాస్టార్ జతకట్టి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇక ముఖ్యంగా చిరంజీవి_ విజయశాంతి అంటే అభిమానుల్లో ఉండే ఆ ప్రత్యేకమైన ఆసక్తి మరో రేంజ్.


దర్శక నిర్మాతలు ఈ జంటతో సినిమా చేస్తే కాసుల వర్షం కురుస్తుందని గట్టిగా నమ్మేవారు. అలాగే వారితో సినిమాలు తీస్తే.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టేవి. చిరంజీవి- విజయశాంతి ల కాంబినేషన్లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, చాలెంజ్, పసివాడి ప్రాణం, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్ వంటి బ్లాక్ బస్టర్స్ చాలానే ఉన్నాయి. ఇప్పటికీ వీరు కలిసి నటిస్తే చూడాలని కోరుకునే అభిమానులు, ప్రేక్షకులు చాలా మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గ్యాంగ్ లీడర్ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని అప్పటినుంచి వీరు మాట్లాడుకోవడం లేదనే ప్రచారం కొన్నేళ్లుగా సాగుతోంది. దీనికి తాజాగా ఆమె వివరణ కూడా ఇచ్చారు. సినిమాలకు గుడ్ బై చెప్పాక ఆమె రాజకీయాల్లోకి వెళ్లారు.

Advertisement

Advertisement

 

ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఒకప్పుడు సినిమాలు 100.. 200.. 365 రోజులు ఆడేవి. ఆ సమయంలో 100 రోజులు పంక్షన్స్ జరిపి అందరికీ షీల్డ్ ఇచ్చేవారు. ప్ర‌స్తుతం అలాంటి పరిస్థితులు లేవని చెప్పుకొచ్చారు. వారం రోజులు న‌డిస్తే ఆ సినిమా హిట్ అంటున్నారు. ఇప్పటి జనరేషన్ చాలా కొత్తగా ఉందన్నారు. మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడింది సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే. ఆ రోజు చిరంజీవి గారు అలా మాట్లాడతారని నేను అనుకోలేదు. అప్పటికీ నేను ఆయన మాట్లాడుకుని దాదాపు 20 ఏళ్లు అయి ఉంటుందని చెప్పుకొచ్చారు.

మా ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల్లేక‌పోవ‌డానికి కార‌ణ‌మంటూ ప్ర‌త్యేకంగా ఏమీ లేదు. రాజకీయాలలోకి వచ్చాక ఒకరినొకరం మాట్లాడాల‌నుకుంటాం. ఆ తర్వాత మళ్లీ కలిసి మాట్లాడుకోవాల‌ని ఏమి లేదు క‌దా.. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ చేయమని అడిగాను. కానీ, ఏ ఒక్కరూ సపోర్ట్ చేయలేదు. తెలంగాణ కోసం ఉద్యమం జరిగినప్పుడు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.అంత సీరియస్ ఇష్యూ ఇది అందుకే సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కావాలని అడిగాము. ఎవరూ స్పందించలేదు. ఆ రకంగా మాట్లాడుకోవడం మానేశాము. సినిమాల్లో నటించినప్పుడు బాగానే మాట్లాడుకున్నామని విజయశాంతి తెలిపారు.

Also Read :  వాస్త‌వం ఏమిటో నాకు తెలుసు.. కానీ న‌న్ను న‌మ్మేవారే లేరు.. రాహుల్ సిప్లిగంజ్ ఎమోష‌న‌ల్..!

Visitors Are Also Reading