వివాదాస్పద చిత్రంగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న మూవీ ‘ది కేరళ స్టోరీ’. మే 07న దేశవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలపై వ్యతిరేకత వ్యక్తం అయిననేపథ్యంలో దక్షిణాదిలో తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ మూవీ విడుదలయ్యే థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో థియేటర్ లో యజమాన్యాలు ఈ సినిమాని ప్రదర్శించకూడదని ఆన్ లైన్ టికెట్ బుకింగ్ తొలగించారు.
READ ALSO : టాలీవుడ్ హీరోకు 10 లక్షల ఫైన్ కట్టిన ఆర్తి అగర్వాల్…చివరికి ఆ పని చేసి…!
Advertisement
అయితే ది కేరళ స్టోరీ సినిమా విజయశాంతి కామెంట్స్ చేశారు. ది కేరళ స్టోరీ సినిమాపై కొనసాగుతున్న చర్చలు, వాదవివాదాలు, నిరసనలను గమనిస్తుంటే ఒక విషయం బాగా అర్థమవుతోంది. ఏ సినిమా అయినప్పటికీ, దానిని చూడాలా వద్దా?… అందులోని అంశాలు నిజమా, కాదా? అనేది ప్రజలు తమ విజ్ఞతతో తెలుసుకోవాల్సిన విషయం కాగా…. ప్రజలకు ఉన్న ఆ విజ్ఞతని కొన్ని వర్గాలు, చివరికి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ చేతుల్లోకి లాక్కోవడం దురదృష్టకరం అని ఫైర్ అయ్యారు.
Advertisement
READ ALSO : Asia Cup 2023: ఆసియా కప్ 2023 నుంచి పాకిస్తాన్ ఔట్ ?
సెన్సార్‌షిప్ పూర్తి చేసుకున్న ది కేరళ స్టోరీ సినిమాకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లని కోర్టులు సైతం పక్కన పెట్టినప్పుడు ఆ సినిమాని ప్రజలకి దూరం చేసే హక్కు ఎవరికుంది? మనది ప్రజాస్వామిక దేశం… జనం తమ విజ్ఞతతో ప్రభుత్వాలనే ఎన్నుకుంటున్న రోజుల్లో ఒక సినిమాని చూసి, అందులో ఏ అంశాల్ని స్వీకరించాలో… వేటిని తిరస్కరించాలో ప్రజలకి తెలియదని అనుకుంటున్నారా? చివరికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆ వర్గాలకి భయపడి సినిమా ప్రదర్శనకు ఆటంకాలు సృష్టించడం దారుణం అని అగ్రహించారు. గతంలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమా విషయంలోనూ ఇలాగే కొన్ని వర్గాలు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండన్నారు రాములమ్మ.
READ ALSO : టాలీవుడ్ హీరోకు 10 లక్షల ఫైన్ కట్టిన ఆర్తి అగర్వాల్…చివరికి ఆ పని చేసి…!