సినీరంగంలో పురుషాధిక్యత ఎక్కువ ఉంటుంది. అన్ని విభాగాల్లో మగవాళ్ళ డామినేషన్ ఉంటుంది. అలాంటి చోట తలెత్తుకుని సవాల్ విసిరిన కొంతమంది లేడీస్ సూపర్ స్టార్లుగా ప్రజల మన్నలను పొందారు. భానుమతి రామకృష్ణ, సావిత్రి, విజయనిర్మల ఇలా కొందరు ఉన్నారు. ఇందులో విజయశాంతి కూడా ఒకరు. సుదీర్ఘ కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా మారారు. ఆమె యాక్షన్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా గా జేజేలు అందుకున్నారు. ఒక దశలో స్టార్ హీరోల సినిమాలకు ఆమె చిత్రాలు గట్టి పోటీని ఇచ్చాయి.
Advertisement
ఆమె పని అయిపోయిందని ప్రతిసారి దూసుకు వెళ్తూ ఉండేది టాప్ హీరోలకి కూడా గట్టి పోటీ ఇచ్చింది. అగ్ర నాయకులు, చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరికీ విజయశాంతి విజయ నాయకగా నిలిచారు. బాలయ్య చిరు సినిమాలకు ఈమె హీరోయిన్ గా నటించేది చిరంజీవి విజయశాంతి జోడిగా 19 సినిమాలు తెరమీదకి వచ్చాయి. చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. 89 దశకాల్లో ఈ జోడి కి స్పెషల్ క్రేజ్ ఉంది. నందమూరి బాలకృష్ణ తో కూడా ఈమె చాలా సినిమాల్లో నటించారు.
Advertisement
దాదాపు 17 సినిమాల్లో ఈమె నటించారు రెండు సినిమాలు తప్పించి మిగిలినవన్నీ కూడా హిట్లయ్యాయి. ఈ జంట ట్రాక్ రికార్డు గురించి కూడా ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు చిరు బాలయ్య తో తర్వాత రోజుల్లో విజయశాంతి ఎందుకు తరవాత సినిమాలు చేయలేదని బాధ ఇప్పటికే అభిమానుల్లో ఉంది. తర్వాత రోజుల్లో వాళ్లతో ఎందుకు నటించలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పారు. ప్రత్యేకించి అయితే కారణాలు లేవని డేట్స్ కుదరక వేరే సినిమాలు కమిట్ అయ్యి ఉండడంతో సాధ్యపడలేదని ఆమె అన్నారు తన ఇమేజ్ తారా స్థాయికి చేరడంతో ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాల్సి వచ్చిందని అని అన్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!