సాధారణంగా దర్శకులు హాలీవుడ్ సినిమాల నుండి కొరియన్ జపనీస్ సినిమాల నుండి సీన్లను లేపేయడం చాలా కామన్ గా చూస్తుంటాం. ఇక కొంతమంది దాన్ని సీన్లను కాపీ కొట్టడం లేపేయడం అంటే మరికొందరు ఇన్స్పిరేషన్ అంటూ పాజిటివ్ గా చెప్పుకుంటారు. అయితే ఒకే భాషలో వచ్చిన సినిమాల నుండి సీన్లను లేపేయడం పెద్దగా కనిపించదు. అలా చేస్తే దొరికిపోయే ఛాన్స్ ఉంది. దొరికిపోతే నెటిజన్లు ఏ రేంజ్ లో ఆడుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఇప్పుడు అలాంటిదే ఒకటి జరిగింది. రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలలో విక్రమ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించాడు. ఈ చిత్రంలో ఫహద్ ఫజిల్, సూర్య ముఖ్యమైన పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా విజయ్ సేతుపతి విలన్ గా అదరకొట్టిన సంగతి తెలిసిందే. సినిమాలో విజయ్ సేతుపతి నటనకు విలనిజం కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ముఖ్యంగా విజయ్ సేతుపతి ఎంట్రీ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ సీన్ లో విజయ్ సేతుపతి ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడిపోతుంది. ఇద్దరు పోలీసులు విజయ్ సేతుపతిని ఆటోలో స్టేషన్ కు తీసుకెళుతుండగా విజయ్ సేతుపతి వారిద్దరి పై దాడి చేసి ఆటోను కిందపడేలా చేస్తాడు. ఆ తరవాత పడిపోయిన ఆటోలో నుండే విజయ్ సేతుపతి షర్ట్ లేకుండా బయటకు వస్తాడు.
అంతే కాకుండా తన నోట్లో మత్తు పదార్థాలను పెట్టుకుని ప్రత్యేకమైన మ్యానరిజం తో కనిపిస్తాడు. అయితే అచ్చం ఇలాంటి సీన్ మరో సినిమాలో కూడా ఉంది. విక్రమ్ తమిళ్ సినిమా అన్న సంగతి తెలిసిందే. ఇక కాపీ కొట్టింది కూడా తమిళ చిత్రం అయిన ఖైతీ నుండి అంతే కాకుండా ఈ రెండు సినిమాలకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ కావడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సొంత సినిమా నుండి కాపీ కొట్టావా అంటూ డైరెక్టర్ ను ఆడుకుంటున్నారు.