తమిళనాడులో రాజకీయసమీకరణాలు మారబోతున్నాయా..? తమిళనాట మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుందా..? అంటే అవుననే అంటున్నాయి తమిళమీడియా వర్గాలు. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి త్వరలోనే పొలిటికల్ పార్టీ స్థాపించబోతున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. దానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. విజయ్ ఇటీవల హైదరాబాద్ లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారట.
Advertisement
విజయ్ రహస్యంగా ప్రశాంత్ కిషోర్ ను కలవగా ఆ మ్యాటర్ కాస్తా లీక్ అయ్యింది. దాంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మీటింగ్ లో పొలిటికల్ ఎంట్రీ పై ప్రశాంత్ కిషోర్ చర్చించినట్టు తెలుస్తోంది. విజయ్ సన్నిహితుడు ఒకరు తాజాగా చేసిన కామెంట్లు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ మారాయి.
Advertisement
తమిళనాడులో కొత్త రాజకీయసమీకరణాలు రాబోతున్నాయని అన్నారు. అధికారంలోకి వచ్చి డీఎంకేను ఢీ కొట్టే సత్తా అన్నా డీఎంకే కు లేదని అన్నారు. దాంతో ఆ పార్టీలోని చాలా మంది అసంత్రుప్తితో ఉన్నట్టు చెప్పారు. కాబట్టి విజయ్ పార్టీ పెడితే వారంతా ఆ పార్టీలో చేరే అవకాశముందని పేర్కొన్నారు.
అంతే కాకుండా తమిళ స్టార్ రజినీకాంత్ పార్టీని ప్రకటించిన వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. దాంతో రజినీకాంత్ అభిమానులు కొంతమంది డీఎంకేలో చేరారు. మరికొందరు ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు. విజయ్ పార్టీ స్థాపిస్తే వాళ్లు కూడా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా విజయ్ 2026 ఎన్నికల్లో మెగాకూటమితో భరిలోకి దిగితే అధికారంలోకి కూడా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.