Home » బాలయ్య, చిరంజీవిని ఆ విషయం లో వెనక్కి నెట్టేసిన తమిళ స్టార్ విజయ్…!

బాలయ్య, చిరంజీవిని ఆ విషయం లో వెనక్కి నెట్టేసిన తమిళ స్టార్ విజయ్…!

by AJAY
Ad

సంక్రాంతి అంటే పండగతో పాటు థియేటర్ల వద్ద సినిమాల సందడి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోలు తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. కొత్త సినిమాల విడుదలతో స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద బరిలోకి దిగుతారు. అలా బరికిలోకి దిగినప్పుడు తమ హీరో సినిమా హిట్ అయితే అభిమానులు కుషీ అవుతారు.

Advertisement

ఈ ఏడాది కూడా స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపిస్తున్న పోస్టర్ ను విడుదల చేయగా ఆకట్టుకుంటోంది.

Advertisement

అదేవిధంగా బాలయ్య హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దాంతో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య పోటీ ఉండబోతుందని అంతా అనుకున్నారు. ఇక ఇప్పుడు దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమాను సైతం సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ హీరోగా నటించాడు. కాగా సంక్రాంతికి వాల్తేరు వీరయ్య.. వీర సింహారెడ్డి సినిమాల కంటే తమిళ హీరో నటించిన వారసుడు సినిమనే ఎక్కువ థియేటర్లలో విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading