ఏ మాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలతో ముందుకు సాగుతూ, ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. ఇక అప్పట్నుంచి ఏమాత్రం వెను తిరిగి చూడకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే సినిమాల పరంగానే కాదు బ్యాక్గ్రౌండ్ వ్యాల్యూను కూడా భారీగా పెంచుకుంటూ ముందుకు పోతున్నాడు. అలాగే సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇన్ని రోజుల వరకు కేవలం టాలీవుడ్ కే పరిమితమైన హీరో ఇప్పుడు లైగర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. అయితే ఇవాళ విజయ్ దేవరకొండ బర్త్ డే.
అయితే ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి గీతా గోవిందం,టాక్సీ వాలా వంటి సూపర్ హిట్ సినిమాలు చేసి స్టార్ హీరో ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. అలాగే మహానటి సినిమా లోనూ ఓ కీలక పాత్ర పోషించి అందర్నీ అలరించాడు. అయితే ముందుగా ఎన్ని హిట్లు కొట్టాడో ఆ తర్వాత అన్ని ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. ద్వారకా, నోటా,డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో విజయ్ దేవరకొండ సినీ గ్రాఫ్ కొద్దిగా పడిపోయింది.
Advertisement
Advertisement
అయితే టాలీవుడ్లో మంచి హీరోగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ బాలీవుడ్లోనూ తన సత్తా చాటలని నిరూపించుకున్నాడు. ఇందులో భాగంగానే పూరి జగన్నాథ్ కాంబినేషన్లో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. చార్మి, కరణ్ జోహార్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అరన్యా పాండే హీరోయిన్ గా నటిస్తోంది. లైగర్ సినిమా రిలీజ్ కాకముందే పూరి జగన్నాథ్ తో జనగణమన అనే సినిమాను చేస్తున్నట్లు రివీల్ చేశాడు. అయితే ప్రస్తుతం కాశ్మీర్లో ఉన్న విజయ్ దేవరకొండ తన బర్త్ డేని సమంతతో కలిసి చేసుకున్నాడు. హీరోగా తన సత్తా ఏంటో నిరూపించిన విజయ్ దేవరకొండ బిజినెస్ లో కూడా సక్సెస్ అయ్యాడు. మీకు మాత్రమే చెబుతా అనే సినిమాతో నిర్మాతగా మారాడు.
ఇందుకోసం కంగ్ ఆఫ్ ద హీల్స్ అనే బ్యానర్ ని కూడా స్థాపించాడు. సినిమాలే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 2018 జాబితాలో 72 వ స్థానాన్ని, 2019లో 30 వ స్థానాన్ని దక్కించుకుని సత్తా చాటాడు. అలాగే ఏకకాలంలో నాలుగైదు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ హీరో చాలా తక్కువ సమయంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగాడు. దీంతో అతని నికర విలువ దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే విజయ్ దేవరకొండ తన ఒక్కో సినిమాకి 10 నుంచి 12 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారట. విజయ్ ఒక నెలలో దాదాపు కోటి రూపాయల వరకు ఆదాయాన్ని అందుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. అలాగే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఒక విలాసవంతమైన భవనం కూడా ఉంది. దీని విలువ సుమారు 15 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అలాగే ప్రస్తుతం అతను వాడుతున్న కార్లు ఇతర యాక్సెసరీల విలువ 8 కోట్ల వరకు ఉంటాయని అంటున్నారు.
ALSO READ;
F3 ట్రైలర్ విడుదల.. చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు..!
ఆ స్టార్ హీరో చేయాల్సిన “ఠాగూర్” సినిమాను చిరంజీవి లాక్కున్నారా..? తెరవెనక జరిగింది ఇదేనట..!