సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి విడాకుల వార్తలు వినిపిస్తాయో చెప్పలేం. అప్పటి వరకూ కలిసి మెలిసి కనిపించిన జంటలు ఉన్నట్టు ఉండి విడాకులను ప్రకటిస్తుంటాయి. ఇప్పటికే గతేడాది నుండి వరుస విడాకుల వార్తలు విని ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. సమంత నాగచైతన్య గతేడాది విడాకులను ప్రకటించారు. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు.
Advertisement
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జంటలు విడాకులను ప్రకటించాయి. ఇక తాజాగా కోలీవుడ్ లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. తమిళ హీరో విజయ్ ఆంటోని తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
Advertisement
అంతే కాకుండా విజయ్ ఆంటోని నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా తరవాత విజయ్ ఆంటోని చాలా సినిమాలను తెలుగులో డబ్ చేసినా బిచ్చగాడు రేంజ్ లో హిట్ పడేలేదు. ఇదిలా ఉండగా విజయ్ ఆంటోని పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. విజయ్ ఆంటోని 2006లో ఫాతిమా అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఫాతిమా టీవీ యాంకర్ కాగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో చూసి ఫాతిమాతో ప్రేమలో పడ్డాడు.
ఆ తరవాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక రీసెంట్ గా విజయ్ తన ట్విట్టర్ లో కుటుంబంలో సమస్యలు వస్తే ఇద్దరే పరిశ్కరించుకోవాలని ఒకవేళ పరిష్కారం కాకపోతే ఇల్ల విడిచి వెళ్లిపోయి విడివిడిగా బ్రతకాలని పేర్కొన్నాడు. అంతే కానీ మూడో వ్యక్తిని పిలిచి పరిష్కరించమని కోరవద్దని వారు మీ నాశనాన్ని చూసి ఆనందిస్తారని పేర్కొన్నాడు. దాంతో విజయ్ ఫాతిమా మధ్య గొడవలు జరుగుతున్నాయని వారు విడిపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.