Ad
టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కానీ ఇప్పటీ ప్రభాస్ యొక్క ఆదిపురుష్ సినిమా యొక్క షూటింగ్ అనేది పూర్తి అయ్యింది. దాంతో ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్న విషయం తెలిసిందే.
అయితే ఈ ఆదిపురుష్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. కానీ సంక్రాంతి అనేది సినిమాల విడుదలకు చాలా పెద్ద పండుగా అనే చెప్పాలి. ఏ సినిమా అయిన సంక్రాంతికి ఒంటరిగా రావడం చాలా కష్టం. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ప్రభాస్ యొక్క ఆదిపురుష్ సినిమాకు పోటీగా.. తమిళ హీరో విజయ దళపతి వస్తున్నాడు.
విజయ్.. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో విడుదల కానుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఈ వారసుడు సినిమాను కూడా ప్రభాస్ ఆదిపురుష్ కు పోటీగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దాంతో ప్రభాస్, విజయ్ సినిమాల మధ్య సంక్రాంతికి పెద్ద పోటీనే జరగనుంది అనేది స్పష్టం అవుతుంది.
ఇవి కూడా చదవండి :
సంజూ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పనున్న బీసీసీఐ..!
రోహిత్ శర్మకు కూడా కోపం తెపించిన హెచ్సీఏ..!
Advertisement