సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. నయనతార ప్రస్తుతం తెలుగుతో పాటూ ఇతర భాషల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాలో మెరిశారు. ఇక నయన్ గతంలో శింబుతో ప్రేమాయణం నడిపించి హాట్ టాపిక్ గా మారింది. ఆ తరవాత ఏవో కారణాల వల్ల ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.
Advertisement
ఆ తరవాత నయన్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవతో ప్రేమాయణం నడిపించింది. అప్పటికే పెళ్లై పిల్లలు ఉండటంతో నయన్ పై చాలా మంది మండిపడ్డారు. అంతే కాకుండా నయన్ ప్రభుదేవాల వ్యవహారం పెళ్లి వరకూ వెళ్లింది. త్వరలో పెళ్లి అని వార్తలు వచ్చాయి కానీ కొంతకాలానికి ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.
Advertisement
ఇక బ్రేకప్ తరవాత చాలా కాలం సింగిల్ గా గడిపిన నయన్ ఆ తరవాత తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే నయన్ విఘ్నేష్ దంపతులు ఇద్దరు కవల పిల్లలకు సరోగసి పద్దతి ద్వారా జన్మనివ్వడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. కాగా ఇప్పుడు ఈ వ్యవహారం తమిళనాడు ప్రభుత్వం విచారణ జరుపుతోంది.
తాజాగా సరోగసీ వ్యవహారంపై విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటి నయనతార దంపతుల వివరణ కోరనుంది. పెళ్లైన 4నెలలకే కవలపిల్లలను కనడంపై విమర్శలు రావడంతో ఈ విషయం పై విఘ్నేశ్ శివన్ పరోక్షంగా స్పందించాడు. సరైన టైం అన్నీ తెలుస్తాయని విఘ్నేశ్ శివన్ పేర్కొన్నాడు.