తమిళ దర్శకుడు వెట్రీమారన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దర్శకుడు వెట్రీమారన్ కు తెలుగు ప్రేక్షకుల్లో అభిమానులు ఉన్నారు. ఆయన ‘ఆడుకాలం’ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆయన తీసిన చిత్రాలకు జాతీయ పురస్కారాలు వచ్చాయి. ధనుష్ హీరోగా ఆయన తీసిన అసురన్ ను తెలుగులో నారప్ప గా రీమేక్ చేశారు.
READ ALSO : చిరంజీవి, బాలయ్యతో రొమాన్స్ చేయడం ఇష్టం : కుష్బూ
Advertisement
తమిళ హాస్యనటుడు సూరి హీరోగా వెట్రీమారన్ దర్శకత్వం వహించిన సినిమా ‘విడుదల పార్ట్ 1’ విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో నటించారు. తమిళంలో మార్చి 31న విడుదలైంది. తెలుగులో ఏప్రిల్ 15వ తేదీన విడుదలైంది. కుమరేషన్ (సూరి) కొత్తగా ఉద్యోగంలో చేరిన పోలీస్ కానిస్టేబుల్. అతనికి ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు. అయితే అక్కడ పోలీసులకి, ప్రజాధళం సభ్యులకు ఎన్కౌంటర్లు, ఒకరి మీద మరొకరు పై చేయిగా ఉండడానికి ఏమి చేయాలనే ప్లాన్స్ చేస్తూ ఉంటారు.
Advertisement
READ ALSO : విరూపాక్షలో ఈ అఘోరా పాత్ర హైలెట్ అవుతుందా…?
అలా ఈ సినిమా ముందుకు సాగుతుంది. అయితే జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి, సూర్య నటించిన పోలీస్ యాక్షన్ డ్రామా విడుదలై-1 చిత్రం తమిళనాట సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తమిళ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోం ది. ఈనెల చివరి వారంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుం ది. ఈ మూవీని తెలుగులో విడుదల పార్ట్-1 పేరు తో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది.
READ ALSO : విరాట్ అంకుల్… వమికాను డేట్ కు తీసుకెళ్లొచ్చా… బుడ్డోడి ప్లకార్డు వైరల్