నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరో విక్టరీ వెంకటేష్. అప్పటి స్టార్ హీరోల డేట్ లు దొరక్కపోవడంతో రామానాయుడు వేరేవాళ్ల కంటే తన కొడుకునే హీరోని చేసి సినిమాలు చేస్తే సరిపోతుందని అనుకున్నారట. ఈనేపథ్యంలోనే వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడగా స్టార్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ లోని ఇతర స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు.
Advertisement
వెంకటేష్ ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు చేయడంతో ఆయనకు ఎక్కువగా ఫ్యామిలీ అభిమానులు అయ్యారు. కేవలం ఫ్యామిలీ సినిమాల్లోనే కనిపించకుడా అన్ని రకాల పాత్రలలో నటించి మెప్పించాడు. రీసెంట్ గా వెంకటేష్ నారప్ప, ఎఫ్ 3 సినిమాలతో సూపర్ హిట్ లను అందుకున్నాడు. ఇక వెంకటేష్ సినిమాలతో పాటూ టీవీ యాడ్స్ లోనూ నటిస్తున్నారు. దాంతో చేతినిండా డబ్బులు సంపాదించుకున్నాడు.
Advertisement
కాగా వెంకటేష్ ఎంత సంపాదించాడు. ఏం ఆస్తులు ఉన్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇక వెంకటేష్ కు తండ్రి నిర్మాత రామానాయుడు ద్వారా స్థిరాస్థులతో పాటూ చరాస్థులు కూడా వచ్చాయట. వెంకటేష్ తన యవ్వన వయసు నుండే సినిమాల్లోనటిస్తున్నాడు.
దాంతో ఇప్పటి వరకూ వెంకటేష్ కేవలం సినిమాల ద్వారానే రూ.2000 కోట్ల వరకూ ఆస్తులను సంపాదించుకున్నాడు. అంతే కాకుండా వెంకటేష్ తండ్రి రామానాయుడికి సైతం చెన్నై లో కూడా ఆస్తులు ఉన్నాయి. అయితే ఆ ఆస్తులను వెంకటేష్, సురేష్ బాబు ఇంకా పంచుకోలేదని చెబుతుంటారు.