బాలీవుడ్ బార్బీ కత్రినాకు కాబోయే భర్త, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. విక్కీ అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎలాంటి పాత్రలోనైనా చాలా సింపుల్‌గా తీసుకుని అందులో ఒదిగిపోయే నటుల్లో విక్కీ కౌశల్ ఒకరు. ‘మసాన్’ , ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి చిత్రాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ‘వన్ టు వన్ బ్రిలియంట్’ సినిమాలతో తన నటనతో మంచి సక్సెస్ ఫుల్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విక్కీ కౌశల్ తన సినిమాల గురించి కాకుండా తన పెళ్లి గురించి చాలా వార్తలు వస్తున్నాయి. విక్కీ కౌశల్ డిసెంబర్ 9న నటి కత్రినా కైఫ్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ రిసార్ట్‌లో ఈ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు అంటే డిసెంబర్ 7వ తేదీ నుంచి వీరిద్దరి పెళ్లి కార్యక్రమాలు కూడా ప్రారంభం కానున్నాయి.
Advertisement
Advertisement
విక్కీ కౌశల్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?
ఈ వివాహం రాయల్ వెడ్డింగ్ అన్న విషయం తెలిసిందే. విక్కీ కౌశల్ తన పెళ్లి కోసం చాలా ఖర్చు చేస్తున్నాడు. కాబట్టి ఆయన నెట్ వర్త్ గురించి చూద్దాం. సమాచారం ప్రకారం ఆయన మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ. 25 నుండి 30 కోట్లు. ఒక్కో సినిమాకి 3 నుంచి 4 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడని కొన్ని రిపోర్టులు వచ్చాయి.