సాధారణంగా క్రికెటర్లకు హీరోయిన్ లకు ఓ ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. ఎక్కువ మంది క్రికెటర్ లు హీరోయిన్లతోనే ప్రేమలో పడతారు..డేటింగ్ లు చేస్తారు. అయితే కొంతమంది పెళ్లిళ్లు చేసుకుంటే మరికొందరు మధ్యలోనే విడిపోతారు. మరోవైపు స్టార్ హీరోయిన్ లు కూడా క్రికెటర్ లకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. అయితే తాజాగా భారత క్రికెకటర్ ఒకరు హీరోయిన్ ఫోటోకు కామెంట్ చేసి నెట్టింట ట్రోల్స్ కు గురవుతున్నాడు. ఆ క్రికెటర్ మరెవరో కాదు వెంకటేష్ అయ్యర్.
Advertisement
ఈ ఆటగాడు గత ఐపీఎల్ లో సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈసారి కూడా వెంకటేష్ అయ్యర్ కోల్ కతా ఓపెనర్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే తాజాగా వెంకటేష్ అయ్యర్ ఓ టాలీవుడ్ హీరోయన్ ఫోటోకు కామెంట్ పెట్టి నెట్టింట ట్రోల్స్ కు గురయ్యాడు. టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చతెలుగు అమ్మాయి అయిన ప్రియాంక షార్ట్ ఫిల్మ్ ద్వారా పాపులారిటీ సంపాదించి హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
Advertisement
రీసెంట్ గా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ ఆర్ కల్యాణమండపంలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్థూ ఫుల్ బిజీగా ఉంది. అయితే ప్రియాంక జవాల్కర్ షూటింగ్ గ్యాప్ లో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. ఇక తాజాగా కూడా ప్రియాంక జవాల్కర్ ఓ ఫోటోను షేర్ చేసింది.
అయితే ఈ ఫోటోకు వెంకటేష్ అయ్యర్ కామెంట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక ఫోటోకు వెంకటేష్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్ పెట్టాడు. దానికి హీరోయిన్ హూ…యూ అంటూ రిప్లై ఇచ్చింది. ఎవరు నువ్వు అంటూ అయ్యర్ రిప్లై ఇవ్వడంతో అందరూ ఆశ్యర్యపోతున్నారు. ఇక మరికొందరు నెటిజన్లు కాకా పడుతున్నావు కదా అంటూ కామెంట్ చేస్తుంటే మరి కొందరు మరీ ఇంతకరువు ఏంటి భయ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు.