Home » స‌మంత కొత్త లుక్ పై చైతూ మ‌ర‌ద‌లు షాకింగ్ కామెంట్స్..!

స‌మంత కొత్త లుక్ పై చైతూ మ‌ర‌ద‌లు షాకింగ్ కామెంట్స్..!

by AJAY
Ad

టాలీవుడ్ ల‌వ్ లీ క‌పుల్ స‌మంత నాగ‌చైత‌న్య‌లు విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి విడాకుల పై కొన్ని నెల‌లుగా వార్త‌లు రాగా చివ‌రికి అంతా అనుకున్న‌ట్టే జ‌రిగింది. ఇద్ద‌రూ తాము విడిపోతున్న‌ట్టు అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించారు. ఇక విడాకుల ప్ర‌క‌టించిన త‌ర‌వాత కూడా వీరిద్ద‌రూ మ‌ళ్లీ క‌లుస్తార‌ని అంతా అనుకున్నారు. కానీ అలా జరిగే అవ‌కాశం లేద‌ని కొంత‌కాలానికే క్లారిటీ వ‌చ్చింది.

Advertisement

ఇక విడాకుల త‌ర‌వాత నాగ‌చైత‌న్య స‌మంత ఇద్ద‌రూ తమ త‌మ సినిమాల‌తో ఫుల్ బిజీ అయిపోయారు. అంతే కాకుండా వ్యాపారాల‌తోనూ ఇద్ద‌రూ చాలా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే స‌మంత విడాకుల త‌ర‌వాత గ్లామ‌ర్ హ‌ద్దుల‌ను కూడా చెరిపేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

samantha-akkineni

samantha-akkineni

పుష్ప సినిమాలో ఊ అంటావా అంటూ ఐట‌మ్ పాట‌కు స్టెప్పులు వేసి అంద‌ర్నీ అవాక్క‌య్యేలా చేసింది. ఇదిలా ఉండ‌గానే రీసెంట్ గా స‌మంతను క్రిటిక్స్ చాయిస్ అవార్డు వ‌రించింది. ఈ అవార్డు ఫంక్ష‌న్ కోసం స‌మంత ముంబైలో ఎమ‌రాల్డ్ గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్ లో అవార్డు ఫంక్ష‌న్ కు హాజ‌రైంది. ఎమ‌రాల్డ్ గ్రీన్ మ‌రియు బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్సులో అందాల ఆర‌బోత‌తో త‌లుక్కుమంది.

ఇక ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా స‌మంత పై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. మరీ ఇంత బ‌రితెగించాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజాగా స‌మంత ఫోటోకు వెంకీ కూతురు నాగ‌చైత‌న్య మ‌ర‌ద‌లు అశ్రిత ద‌గ్గుబాటి చూడ‌ముచ్చ‌టేస్తుంది అంటూ కామెంట్ పెట్టింది. ప్ర‌స్తుతం అశ్రిత కామెంట్ కు నెటిజ‌న్లు తెగ లైకులు కొడుతున్నారు.

Visitors Are Also Reading