Home » Veekshanam Movie Review: ‘వీక్షణం’ మూవీ రివ్యూ

Veekshanam Movie Review: ‘వీక్షణం’ మూవీ రివ్యూ

by Sravan Sunku
Ad

‘వీక్షణం’ మూవీ రివ్యూ: రామ్ కార్తీక్, క‌శ్వి జంటగా నటించిన మూవీ ‘వీక్షణం’. ‘ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్’ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి మ‌నోజ్ ప‌ల్లేటి దర్శకుడు.ఈరోజు అనగా అక్టోబర్ 18న థియేట్రికల్లలోకి వచ్చింది ఈ సినిమా. అయితే కంటెంట్ పై ఉన్న నమ్మకంతో ఒకరోజు ముందుగానే స్పెషల్ ప్రీమియర్స్ వేశారు చిత్ర యూనిట్ సభ్యులు. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

veekshanam-movie
కథ :
ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసించే అర్విన్ (రామ్ కార్తిక్)కు బైనాకులర్స్ పెట్టుకుని పక్కింట్లో వాళ్ళ ఇళ్ళలో ఏం జరుగుతుందో తెలుసుకునే అలవాటు ఉంటుంది.’స్పైడర్’ లో మహేష్ బాబులా అనమాట. అలా చూస్తున్న క్రమంలో అతనికి నేహ(కశ్వి ) కనిపిస్తుంది. తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమని దక్కించుకునేందుకు తన స్నేహితుల సాయం కోరతాడు. మొత్తానికి ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఒక రోజు ఆమెతో గొడవ పడతాడు అర్విన్. అదే టైములో మరో ఇంటిని అలాగే పరిశీలిస్తుండగా మరో అమ్మాయి ఇతనికి కనిపిస్తుంది. తర్వాత ఆమె హత్యలు చేస్తూ ఇతని కంటపడుతుంది. తర్వాత ఆమెని ఫాలో చేయగా ఆమె చంపాలనుకునేవాళ్ళ లిస్ట్ లో నేహా కూడా ఉందని తెలిసి షాకవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.

Advertisement

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో పాత్రలో రామ్ కార్తీక్ జీవించేశాడు. ఇక హీరోయిన్ కశ్వి ఓ పక్క గ్లామర్ తో ఆకర్షిస్తూనే మరోపక్క తనదైన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. బిందు నూతక్కి సైకో పాత్రలో ఆకట్టుకుంది. బంచిక్ బంటీ అలియాస్ ఫణి నవ్వులు పూయించాడు. సమ్మెట గాంధీ, నాగ మహేష్ తమ పాత్రలకి న్యాయం చేశారు.

Advertisement

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సంగీత దర్శకుడు సమర్ద్ గొల్లపూడి ఎక్కువ మార్కులు కొట్టేసాడు. థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యమో మరోసారి నిరూపించాడు. సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సిద్ శ్రీరామ్ పాడిన ఎన్నెన్నెన్నో సాంగ్ అలరిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. క్లైమాక్స్ ఫైట్ ను బాగా డిజైన్ చేశారు.నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ : ‘పక్కవాడి లైఫ్ లో ఏం జరుగుతుంది?’ అనేది తెలుసుకోవాలని ఆశపడితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ సినిమాలో హీరో పాత్ర ద్వారా తెలిపాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే బాగుంది. గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్, హీరో ఫ్రెండ్స్ చేసే కామెడీ, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుండి వచ్చే ట్విస్ట్స్ ఆద్యంతం అలరించే విధంగా ఉంటాయి. ఇక ఇంటర్వెల్ తర్వాత చనిపోయిన అమ్మాయి ఎలా హత్యలు చేస్తుంది? అని హీరో అతని స్నేహితుల బృందం కనుగొనే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ అయితే రొటీన్ కి భిన్నంగా సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చేలా ఉండడం గమనార్హం. నిజానికి దర్శకుడికి ఇది మొదటి సినిమా అంటే నమ్మడం కష్టమే. అంతలా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. చాలా చోట్ల ప్రేక్షకులు ఊహకు అందకుండా కథ నడిపించడంలో దర్శకుడికి ఫుల్స్ మార్క్స్ పడతాయి. తాను చెప్పాలనుకున్న పాయింట్ ను సూటిగా సుత్తి లేకుండా చెప్పడంలో, సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తున్న ఒక సమస్యను కూడా టచ్ చేసిన విధానం బాగుంది.

చివరి మాట : వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్.. తప్పకుండా ఈ వీకెండ్ కి థియేటర్లలో చూడదగ్గ సినిమా

రేటింగ్ : 3.25/5

Visitors Are Also Reading