Home » మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూత..!!

మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూత..!!

by Sravanthi
Ad

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన వట్టి వసంత కుమార్ కాలం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ , పరిస్థితి విషమంగా మారడంతో ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు శోకశాంద్రంలో మునిగారని చెప్పవచ్చు. వట్టి వసంత్ కుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పుండ్ల..

Advertisement

ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఉంగటూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. ఇక 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో , ఆ తర్వాత రోశయ్య కేబినెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు వసంత్ కుమార్. అయితే ఈ మధ్యకాలంలోనే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంతో వసంత కుమార్ జనసేన పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి.

Advertisement

ఈ తరుణంలో ఆయన స్పందించి నేను పవన్ కళ్యాణ్ తో రాజకీయాల గురించి చర్చించలేదని, మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. ప్రస్తుతం ఆయన మరణ వార్త విన్న అభిమానులు,కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో ఆయన భౌతికకాయాన్ని తన సొంత గ్రామమైన పూండ్లకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారట. ఆదివారం సాయంత్రం ఆయన అంతక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు.

also read:

Visitors Are Also Reading