ప్రతి ఒక్కరూ కూడా వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఏ దేవుణ్ణి పూజించాలన్న మొట్ట మొదట మనం గణపతిని పూజిస్తాము . గణపతని పూజించడం వలన అంతా శుభమే జరుగుతుంది, ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు కలగవు. వినాయక చవితి కూడా దగ్గరికి వచ్చేస్తుంది. వినాయకుడిని ఆరాధించేటప్పుడు చేయకూడని తప్పులు తెలుసుకోండి. వినాయకుడి విగ్రహాన్ని ఉంచేటప్పుడు ఏ దిశలో పెట్టాలి అనేది కూడా చాలా ముఖ్యమే గణేష్ విగ్రహాన్ని ఈశాన్యం మూలలో పెడితే మంచిది.
Advertisement
Advertisement
ఈశాన్యంలో వినాయకుడిని పెట్టి పూజిస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది. డస్ట్ బిన్లు, స్టోర్ రూము మెట్ల కింద, బాత్రూం కి దగ్గరలో పెట్టకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం వినాయకుడి విగ్రహాన్ని పెట్టేటప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. లలితాసనంలో కూర్చున్న వినాయకుడి చిత్రం లేదా వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే ఎంతో మంచి జరుగుతుంది శాంతిని ఇది సూచిస్తుంది. వాస్తు ప్రకారం వినాయకుడిని తీసుకువచ్చేటప్పుడు గణేషుడు తొండం ఎడమవైపు ఉండేటట్టు చూసుకోవాలి. అటువంటి వినాయకుడిని మాత్రమే తీసుకురావాలి అప్పుడు విజయం కలుగుతుంది.
Also read:
- తలస్నానం చేసినప్పుడల్లా.. జుట్టు రాలిపోతోందా..? అయితే ఇలా చేయండి..!
- అద్దంపై నీటి మరకలను.. ఇలా సులభంగా క్లీన్ చెయ్యండి..!
- గుత్తులుగా గులాబీ పూలు పూయాలంటే.. ఇలా చేయండి..!