Home » Vastu tips: ఈ మొక్కను మీ ఇంటికి సరైన దిశలో పెంచండి.. ఇక ఇంట్లో డబ్బే డబ్బు..!!

Vastu tips: ఈ మొక్కను మీ ఇంటికి సరైన దిశలో పెంచండి.. ఇక ఇంట్లో డబ్బే డబ్బు..!!

by Sravanthi
Ad

మన భారతదేశంలో వాస్తు శాస్త్రాలను ఎక్కువగా నమ్ముతాం.. చిన్న రాయి నుండి చెట్టు వరకు పూజిస్తాం.. ముఖ్యంగా వాస్తు శాస్త్రాన్ని బట్టి మనం అనేక పనులు చేస్తాం.. అలాంటిది కొన్ని రకాల మొక్కలను పెంచితే ఇంట్లో ధనవృద్ది జరుగుతుందని శాస్త్ర నిపుణులు అంటున్నారు. మరి ఆ మొక్కలు ఏంటో, అవి ఏ దిశలో పెంచాలో చూద్దాం.. వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం ఇంటి ఆవరణ లోపల కొన్ని రకాల మొక్కలు బయట కొన్ని రకాల మొక్కలను పెంచాలి.. ఇంటి ఆవరణ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది తులసి మొక్క ఈ మొక్కను ప్రతిరోజు పూజిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుందని భావిస్తారు. కాబట్టి తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, ధనలాభం కలుగుతుందని నమ్ముతారు.. అలాంటి మరో మొక్క వెదురు మొక్క..

Advertisement

also read:Railway jobs: టెన్త్, ఇంటర్ పాసయ్యారా.. రాత పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాలు..!!

Advertisement

దీనిని ఇంటి ఆవరణలో పెంచితే నెగిటివ్ ఎనర్జీ పోయి అనేక ప్రయోజనాలు కలుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. మరి ఈ మొక్కను సరైన దిశలో పెంచినప్పుడే ఆ ప్రయోజనాలు ఉంటాయని వారంటున్నారు.. ముఖ్యంగా వెదురు మొక్కను కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చునే చోట పెంచాలట.. ఇంట్లో ఉండే డ్రాయింగ్ హాల్, తదితర ప్రాంతాల్లో ఈ మొక్కను పెంచడం మంచిదట.. ఈ మొక్కను పెంచే ఉత్తమమైన దిశ ఉత్తరం అని వాస్తు నిపుణులు అంటున్నారు.. వెదురు మొక్కను ఇంట్లో పెంచడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుందని, ఆనందంగా జీవిస్తారని అంటున్నారు.

ఒకవేళ జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే వెదురు మొక్క కాడను ఎరుపు రంగు గుడ్డలో చుట్టి ఒక గాజు పాత్రలో ఉంచడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు.. కాబట్టి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోతే వెదురు మొక్కను నాటాలని, దీనిని నాటడం వల్ల ధన లాభం కలుగుతుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లల గదుల్లో ఈ మొక్కను పెంచడం వల్ల వారికి చదువుపై మక్కువ పెరుగుతుందని తెలియజేస్తున్నారు.. మరి ఎందుకు ఆలస్యం వెదురు మొక్క ఇప్పుడే తెచ్చేసుకోండి..

also read:

Visitors Are Also Reading