Home » ల‌క్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట‌వేయాలంటే ఇలా చేయండి..!

ల‌క్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట‌వేయాలంటే ఇలా చేయండి..!

by AJAY
Ad

మ‌నిషి ఆనంద‌మైన జీవితం గ‌డ‌పాలంటే ఆరోగ్యంతో పాటూ డ‌బ్బులు అవ‌స‌రం. అయితే కొంత‌మంది ఎంత క‌ష్ట‌ప‌డినా డ‌బ్బులు సంపాదించ‌లేక‌పోతారు. ఎలాంటి వ్యాపారంలోకి దిగినా న‌ష్టపోతుంటారు. ఉద్యోగం చేసినా ఆర్థిక ఇబ్బందులు రావ‌డం ఏదో ఒక రూపంలో సంపాదించిన డ‌బ్బు పోవ‌డం జ‌రుగుతుంది. ఇక మ‌రికొంద‌రికి ఎంత ప్ర‌య‌త్నించినా ఆదాయ మార్గాలు దొర‌క‌వు. అయితే సంపాదించ డ‌బ్బులు పోకుండా ఉండాల‌న్నా..ఆదాయం పెర‌గాలన్నా ఇంట్లో వాస్తు కూడా స‌రిగ్గా ఉండాల‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ జాగ్ర‌త్త‌లు పాటిస్తే ల‌క్ష్మీదేవి ఇంట్లో తిష్ట‌వేస్తుంద‌ని చెబుతున్నారు.

money

money

ఇంట్లో దక్షిణం వైపు కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి..లేదంటే ఇంట్లో దక్షిణం వైపు ఎత్తుకు సమానంగా అయినా ఉండాలి. ఇంటి ఈశాన్య భాగంలో ఉత్తరం వైపు డోర్ ఉండేలా ఏర్పాటు చేయాలి. దాని ద్వారా ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు మెరుగవుతాయి. ఇంటికి ఈశాన్య భాగంలో నీటి సంప్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. దాంతో ఇంట్లో శాంతి తో పాటు డబ్బు కూడా ఉంటుంది.

Advertisement

Advertisement

also read : మంగ‌ళ‌వారం ఎందుకు క‌టింగ్ చేసుకోకూడ‌దో తెలుసా…?

అంతే కాకుండా ఇంట్లో భారీగా ఉండే వస్తువులను దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. దాంతో ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు పెరుగుతాయి. ఇంటిపై స్ట్రీట్ ఫోకస్ ఉండేలా ఏర్పాటు చేయాలి దాంతో కూడా సంపాదన పెరుగుతుంది. ముఖ్యంగా ఇల్లు లేదా అపార్ట్మెంట్ దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. అలాంటి ఇంట్లోకి డబ్బు ఎక్కువగా వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నైరుతి వైపు నిర్మించే ఇల్లు, భవనాల్లోకి కూడా ఎప్పుడూ డబ్బు ప్రవాహం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Visitors Are Also Reading