బుల్లి తెరపై పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ వర్షిణి. ఈమె తన అందాలను ఆరోబోస్తూ.. తిరుగులేని హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈమె ఈటీవీలో ప్రసారం అవుతున్న రియాల్టీ డ్యాన్స్ షో ఢీ తో బాగా పాపులర్ అయింది. ఈ షోలో రష్మీతో కలిసి వర్షిణి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ షోకు మరింత గ్లామర్ డోస్ తీసుకురావడంలో వర్షిణి బాగా హెల్ప్ అయింది. ఈమె ఢీ లో హైపర్ ఆదికి జోడీగా వర్షిణి ఎంతో సందడి చేసింది. అయితే ఈ షోలో ఆమె కొన్ని కారణా వల్ల గత కొంత కాలం నుంచి కనిపించలేదు. ఆమె ప్లేస్ లో దీపికా పిల్లిని తీసుకున్నారు. ఇక ఆ తరువాత ఢీ షో నుంచి తప్పుకున్న ఆమె మా టీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ లో యాంకర్‌గా కొన్ని రోజులు సందడి చేసింది. ఆ తరువాత ఈ షో నుంచి కూడా మాయమైంది.
Advertisement
చాలామంది బిగ్ బాస్ కోసం.. ఈ షో వదులుకున్నారని అన్నారు. కానీ చివరకు చూస్తే ఆమె బిగ్ బాస్ లో కనిపించలేదు. వర్షిణి బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఇక వర్షిణి ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడింది అట. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ముఖ్యంగా వర్షిణి బుల్లితెరకు రావాలని ఏనాడు అనుకోలేదని.. అయితే తాను మోడలింగ్ చేసేటప్పుడు అవకాశాలే తన వెంట పడ్డాయని ఆమె చెప్పుకొచ్చారు.
Advertisement
ఈ జర్నీలో తాను ఎన్నో అవమానాలకు గురి అయ్యారు. టాలీవుడ్‌కు చెందిన ఓ దర్శకుడు ఓ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పారని.. అగ్రిమెంట్ పై సంతకం చేయడానికి తనను ఇంటికి రమ్మని కోరాడని.. తాను అలాగే ఇంటికి వెళ్లానని చెప్పింది. ఇంటికి వెళ్లిన తరువాత ఆ డైరెక్టర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాలని, ఇష్టం వచ్చిన దగ్గర తాకే ప్రయత్నం చేస్తూ.. చేయి పట్టుకొని తనను బెడ్ పై లాగేందుకు ప్రయత్నించాడని.. కానీ తాను అతడి చెంప చెల్లుమనిపించి అక్కడ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం ఆమె చెప్పకపోవడం గమనార్హం.