Home » వెరైటీ : పెంపుడు కుక్క‌కు సీమంతం

వెరైటీ : పెంపుడు కుక్క‌కు సీమంతం

by Bunty
Ad

సాధార‌ణం గా సీమంతం అనేది ఇంట్లో ఉన్న ఆడ బిడ్డ‌ల‌కు చేస్తారు. కానీ ఇక్క‌డ మాత్రం త‌మ ఇంట్లో పెంచుకుంటున్న ఒక కుక్కు సీమంతం చేశారు. ఒక ఫ్యామిలి. ఈ వెరైటీ ఘ‌ట‌న త‌మిళ‌నాడు లో ని జై హింద్ పూర్ లో చోటు చేసుకుంది. జై హింద్ పూర్ లో ఉన్న పోలీస్ స్టేష‌న్ లో ఎస్ఐ గా ప‌ని చేస్తున్న శ‌క్తి వేల్ ఇంట్లో పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్క కు ప్రెగ్నెన్సీ రావ‌డం తో ఎస్ఐ శ‌క్తి వేల్ దానికి సీమంతం జ‌రిపించాడు.

Advertisement

Advertisement

ఆ సీమంతం సాధాసీధా గా కాకుండా.. అంగ‌రంగా వైభవం గా త‌న కుటుంబ స‌భ్య‌లు తో జ‌రుపుకున్నాడు. ఆ కుక్కు కు గాజులు , దండ ల‌ను వేశాడు. అలాగే హార‌తి కూడా ప‌ట్టాడు. సాధార‌ణం గా అంద‌రి ఇళ్ల‌లో ఆడ కూతుళ్ల కు చేసే విధం గా నే కుక్క కు సీమంతం చేశాడు. అలాగే అచ్చిన అతిథుల‌కు కూడా భోజ‌న ఏర్పాట్లు కూడా చేశాడు. అయితే ఎస్ఐ శ‌క్తి వేల్ కుక్క చేసిన సీమంతం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. అలా గే ఎస్ఐ శ‌క్తి వేల్ కు జంతువుల ప‌ట్ల ఉన్న ప్రేమ ను చూసి చాలా మంది అభినందిస్తున్నారు.

Visitors Are Also Reading