తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటిమని వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. అందులో భాగంగా తమిళ సినిమా ఇండస్ట్రీ తర్వాత ఈనటి ఎక్కువ శాతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సందీప్ కిషన్ హీరోగా రూపొందిన తెనాలి రామకృష్ణ ఎల్ఎల్ బి సినిమా ద్వారా ఈనటి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో వరలక్ష్మి ప్రతినాయకి పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీలోని తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులను వరలక్ష్మి దోచుకుంది. దానితో వరుసగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ నటికీ అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే తెలుగులో ఈనటి క్రాక్, నాంది, యశోద, వీరసింహారెడ్డి సినిమాల్లో కీలకమైన పాత్రల్లో నటించింది.
Advertisement
ఇందులో నాంది మూవీని మినహాయిస్తే మిగతా అన్ని సినిమాల్లో కూడా వరలక్ష్మీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. విలన్ పాత్రల్లో ఈనటి అద్భుతంగా ప్రేక్షకులను అలరిస్తూ ఉండడంతో ఎక్కువ శాతం వరలక్ష్మికి విలన్ పాత్రలలోనే అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి పెళ్లి గురించి కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది.
తాజా ఇంటర్వ్యూలో భాగంగా వరలక్ష్మి పెళ్లి గురించి మాట్లాడుతూ … ప్రతి అమ్మాయికి కూడా పెళ్లి అవసరమా… పెళ్లి చేసుకున్నట్లు అయితే రోజు ఒకడి మొహానే చూడాలి. నా దృష్టిలో పెళ్లికి పెద్దగా నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాలపైనే ఉంది అని చెప్పుకొచ్చింది.