టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ల లో అందాల తార వాణిశ్రీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వాణిశ్రీ ఏపీలోని నెల్లూరు జిల్లాలో 1948 ఆగస్టు 3న జన్మించారు. వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి కాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత వాణిశ్రీ గా మార్చుకుంది. కొంతకాలం తరవాత కుటుంబ పరిస్థితుల కారణంగా వాణి శ్రీ కుటుంబం చెన్నైకి మకాం మార్చారు. నాటకాలపై ఆసక్తి ఉండటంతో కొన్ని నాటకాల్లో నటించింది. వాణిశ్రీ నటన చూసి ఓ దర్శకుడు సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేశాడు.
Advertisement
అలా సినిమాలపై నటిస్తూ ఎన్నో గొప్ప సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకుంది. తెలుగుతో పాటూ ఇతర భాషల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది. మరుపురాని కథ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. ఆ తరవాత వాణి శ్రీ సుఖ దుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో ఎంతో పేరు తెచ్చుకుంది. 1970 దశకంలో స్టార్ హీరోయిన్ గా రానించింది.
Advertisement
తెలుగు తమిళ భాషల్లో ఎంజీఆర్, శివాజీ గణేషణ్ లాంటి అగ్రహీరోలతో సినిమాలు చేసింది. ఇక తెలుగులో రాజబాబు, బాలకృష్ణ లాంటి హాస్య నటుల సరసన సహాయ పాత్రలు చేసింది. అంతే కాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల సరసన కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అయితే వాణిశ్రీ కెరీర్ లో ఎన్టీఆర్ తో నటించిన ఎదురులేని మనిషి సినిమా షూటింగ్ సమయంలో ఓ చేదు అనుభవం ఎదురైంది.
ఈ సినిమాలో ఓ వాన పాటలో పాట కాస్త వల్గర్ గా ఉందట. దాంతో దాంతో వాణి శ్రీ తాను ఆ పాటకు డ్యాన్స్ చేయనని చెప్పేసిందట. ఆ తరవాత ఎన్టీఆర్ కల్పించుకుని ఇలాంటి చిన్న చిన్నవి పట్టించుకోకూడదు అన్నారట. దాంతో వాణిశ్రీ షూటింగ్ నుండి కోపంతో వెళ్లిపోయారట. ఆ తరవాత కొన్ని బుజ్జగింపుల తరవాత పాటను కట్ చేసి సినిమాను పూర్తిచేశారు. అప్పట్లో ఇండస్ట్రీలో ఈ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. ఆ తరవాత వాణిశ్రీకి సినిమా అవకాశాలు కూడా తగ్గాయట.