ఇవాళ హైదరాబాద్ కు ప్రధాని మోడీ వచ్చారు. ఈ నేపథ్యంలోనే.. సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ ను జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని మోదీ. అనంతరం రూ.720 కోట్లతో సికింద్రాబాద్ ఆధునికీకరణ పనులను, సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ డబ్లింగ్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. అయితే.. ఈ సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం. నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఆరు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ వెళ్లనున్నాయి.
READ ALSO : AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…
Advertisement
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో 12 గంటల ప్రయాణం పట్టనుంది. వందే భారత్ ట్రైన్ లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల ప్రయాణం ఉటుంది. దేశంలో ఇది 13వ వందే భారత్ ట్రైన్.. ఇందులో 8 కోచ్ లు 530 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇందులో 1 ఎగ్జిక్యూటివ్, 7 చైర్ కార్ కోచ్ లు ఉంటాయి. ప్రయాణికుల ఆదరణ దృష్ట్యా కోచ్ లను పెంచే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 11.30 నుంచి 12.05 లోపు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం అయింది. ఈ నెల 9 నుంచి ఉదయం 6 గంటలకు ప్రయాణికులకు అందుబాటులో వందే భారత్ ట్రైన్ ఉండనుంది. ఇవాళ్టి వందే భారత్ ట్రైన్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు పయనిస్తుంది.
READ ALSO : కిచ్చా సుదీప్ పై ప్రకాష్ షాకింగ్ కామెంట్స్… బిజెపికి మద్దతు ఇవ్వడం ఏంటి..?
వందే భారత్ ట్రైన్ ఛార్జీలు :
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1680, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3080 రూపాయలు
తిరుపతి నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ఛార్జీ 1625, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3030 రూపాయలు
వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ రాకపోకలు
READ ALSO : IPL 2023 : అయ్యో కేన్ మామ…క్రికెట్ మొత్తానికి దూరం కాబోతున్నాడా ?