ప్రభాస్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో వర్షం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో ప్రభాస్ కు హీరోగా మంచి ఇమేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాతే ప్రభాస్ కెరీర్ కూడా ఊపందుకుంది. 2004వ సంవత్సరం జనవరి 14న ఈ సినిమా విడుదల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకు శోభన్ దర్శకత్వం వహించగా సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా హీరోయిన్ త్రిష నటించి అలరించింది. ఇదిలా ఉంటే కొన్ని సినిమాలలో దర్శకులు గెస్ట్ ఎంట్రీ ఇస్తారన్న సంగతి తెలిసిందే.
Advertisement
అయితే కొన్ని సార్లు వాళ్లు ముఖ్యమైన పాత్రలోనే కనిపిస్తారు కానీ కొన్ని సార్లు జూనియర్ ఆర్టిస్ట్ లలా వచ్చి వెళ్లిపోతారు. పూరి జగన్నాథ్, వి,వి వినాయక్, గౌతమ్ మీనన్ లాంటి వాళ్ళు తమ సినిమాలలో కొన్ని సీన్లలో అలా కనిపించి ఇలా వెళ్ళిపోయారు. ఇక పూరి జగన్నాథ్ ఓ సినిమాలో ఆటో నడుపుతూ కనిపిస్తాడు. అయితే అదే విధంగా వర్షం సినిమాలోనూ ఓ స్టార్ డైరెక్టర్ కనిపించాడు.
Advertisement
ఈ సినిమాలో ప్రభాస్ త్రిష ఎమ్మెస్ నారాయణ మధ్య బస్సులో ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో త్రిష వెనక సీట్ లో స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూర్చుని త్రిశ వైపే చూస్తూ ఉన్నాడు. కానీ ఆయనను అప్పుడు సినిమాలో ఎవరు గుర్తుపట్టలేదు. దానికి కారణం అప్పుడు ఆయన ఎవరికి పరిచయం లేదు. వంశీ పైడిపల్లి ప్రభాస్ హీరోగా మున్నా సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యాడు.
ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా బృందావన కాలనీ తో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో విజయ్ తో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అలా ఒకప్పుడు సినిమాలో ఎవరు గుర్తుపట్టని స్థాయి నుండి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించే స్థాయికి ఎదిగాడంటే వంశీపైడిపల్లి ఎంత కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.
ALSO READ :ఎడిటర్ గౌతమ్ రాజుకు దర్శకుడు రాజమౌళికి మధ్య ఉన్న సంబంధం గురించి మీకు తెలుసా..?