Home » అక్కడ ఆర్ఆర్ఆర్ ను సైతం వెనక్కి నెట్టేసిన వాల్తేర్ వీరయ్య…!

అక్కడ ఆర్ఆర్ఆర్ ను సైతం వెనక్కి నెట్టేసిన వాల్తేర్ వీరయ్య…!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సినిమా వాల్తేర్ వీరయ్య. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వాల్తేర్ వీరయ్య విడుదలయ్యింది. ఈ చిత్రం లో రవితేజ కూడా ముఖ్యమైన పాత్రలో నటించాడు. చిరంజీవి ఈ చిత్రంలో వింటేజ్ లుక్ లో అదరగొట్టాడు.

Advertisement

Advertisement

ఇక ఈ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతికి విడుదల కాగా ఆ అంచనాలకు రెట్టింపు విజయాన్ని అందుకుంది. సినిమాలోని పాటలు యాక్షన్ సీన్ లతో లపాటు చిరంజీవి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అలా ఈ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి కలెక్షన్ కు కూడా భారీగా రావడం తో నిర్మాతల పంట పండింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాను ఓ ప్రాంతంలో దాటేసింది. వైజాగ్ లోని జగదాంబ థియేటర్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ కంటే వాల్తేరు వీరయ్య సినిమాకే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి.

Visitors Are Also Reading