భారత మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్పేయీ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మై అటల్ హూ’ . బాలీవుడ్ సీనియర్ నటుడు పంకజ్ త్రిపాఠి టైటిల్ పాత్ర పోషించారు. రవి జాదవ్ దర్శకుడు. జనవరి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఈ అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీన్లో లో మార్చి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 కొత్త పోస్టర్ ని పంచుకుంది.
Advertisement
Advertisement
అజాత శత్రువులాంటి వ్యక్తి, రాజనీతిజ్ఞుడు అయిన అటల్ బిహారీ వాజ్ పేయి పాలనతో పాటు, రాజకీయ జీవితాన్ని మేళవించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అలాగే ఆయన వ్యక్తిగతంగా ఎదుర్కొన్న – సవాళ్లు, కుటుంబం, స్నేహితులతో ఆయనకున్న బంధాన్ని కూడా తెరపై ఆవిష్కరించారు. కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణు పరీక్షలతో సహా చాలా అంశాలను ఇందులో ప్రస్తావించారు. పీయూష్ మిశ్రా, రాజా రమేశ్ కుమార్ (ఎల్.కె.అద్వానీ), దయాశంకర్ పాండే, ప్రమోద్ పాఠక్, పాయల్ నాయర్, రాజేశ్ ఖత్రి, ఎక్లాక్ ఖాన్, హర్షద్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. వినోద్ భానుశాలి, సందీప్ సంయుక్తంగా నిర్మించారు.