Home » ఇంట్లో బిర్యానీ ఆకులతో పొగ వేస్తే ఏం జరుగుతుందో తెలుసా ..?

ఇంట్లో బిర్యానీ ఆకులతో పొగ వేస్తే ఏం జరుగుతుందో తెలుసా ..?

by AJAY
Ad

బిర్యాని వండుతున్నారు అంటే అందులో ఖచ్చితంగా బిర్యాని ఆకు ఉండాల్సిందే. బగారా, బిర్యానీ, చికెన్ ఇలా కొన్ని వంటకాల్లో బిర్యానీ ఆకులు వాడితేనే ఆ వంటకు వాసన రుచి రెండూ వస్తాయి. బిర్యాని లో వేసుకుంటారు కాబట్టి ఆ ఆకును బిర్యానీ ఆకు అంటారు కానీ దాని అసలు పేరు తేజ పత్ర, తమల పత్ర ఆకు… లేదంటే బేల ఆకు అని పిలుస్తారు. అయితే ఈ ఆకును వంటల్లో వేయడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Advertisement

అంతేకాకుండా బిర్యానీ ఆకును కేవలం వంట లోనే కాకుండా మరో విధంగా ఉపయోగించినా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎలానో ఇప్పుడు చూద్దాం… బిర్యాని ఆకులను ఒక గదిలో కాల్చడం ద్వారా వాటినుండి పొగ వస్తుంది. ఆ పొగను బయటకు వెళ్లనివ్వకుండా తలుపులు వేసి ఉంచాలి. 10 నిమిషాల పాటు అలాగే ఉంచితే గదిలో సువాసన వస్తుంది. ఆ వాసనను పిలిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

Advertisement

 

అలా వచ్చే ప్రశాంతతతో ఒత్తిడి, ఆందోళనలు ఉంటే దూరం అవుతాయి. ఇక అలా సువాసన ద్వారా రోగాలను నిర్మూలించే ప్రక్రియను అరోమా థెరపీ అంటారు. బిర్యానీ ఆకు ను ఈ థెరపీ లో వాడుతారు. కాబట్టి బిర్యానీ ఆకు ఇంట్లో మండించడం ద్వారా ఇంట్లో వారందరికీ ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా ఇంట్లోకి దోమలు కీటకాలు కూడా రాకుండా ఉంటాయి. దోమలు కుట్టకుండా జెడ్ కాయిల్స్ లాంటివి వాడే కంటే బిర్యానీ ఆకులు మందించడమే ఉత్తమం కూడా. దాని వల్ల ఆరోగ్యంతో పాటు దోమలు కూడా రాకుండా ఉంటాయి.

Visitors Are Also Reading