టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ హీరోయిన్ ఊర్వశి రౌటెల తో ప్రేమాయణం నడిపించారని అప్పట్లో వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రిషబ్ ఆస్ట్రేలియాలో టోర్నీ ఆడడానికి వెళ్ళినప్పుడు ఊర్వశి కూడా అతడి కోసం వెళ్ళిందని వార్తలు వినిపించాయి. మరో వైపు ఊర్వశి పంత్ ల మధ్య చిన్న వివాదం కూడా రాసుకుంది. సోషల్ మీడియా ద్వారా ఒకరిపై ఒకరు సెటైర్ లు వేసుకున్నారు. గతంలో ఆర్పి తనకోసం విమానాశ్రయంలో వెయిట్ చేశాడు అంటూ ఊర్వశి చెప్పుకొచ్చింది. దాంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.
Advertisement
ఇద్దరి పేర్లు ప్రస్తావించుకుని మరీ ఒకరిపై ఒకరు సెటైర్ లు వేసుకున్నారు. చివరికి రిషబ్ పంత్ నన్ను వదిలేయు అక్కా అంటూ పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత ఇద్దరు సైలెంట్ అయ్యారు. అయితే తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఊర్వశి స్పందించింది. ఇంటర్వ్యూలో ఆర్ పి అంటే రిషబ్ పంత్ కాదని తన కో స్టార్ రామ్ పోతినేని అని చెప్పింది.
Advertisement
అంతేకాకుండా రిషబ్ పంత్ ను కూడా ఆర్పి అని పిలుస్తారని తనకు తెలియదని వెల్లడించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో సగం వరకు అబద్దాలే అని చెప్పింది. జనాలకు తమకు కావలసిన స్టఫ్ ఊహించుకుని ఏదేదో రాసిస్తారని అలాంటి పుకార్లను నమ్మే వాళ్ళు కొంచెం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.
కొంతమంది యూట్యూబర్స్ తమ వ్యూవర్షిప్ కోసం కల్పించే కట్టు కథలను ఎలా నమ్ముతారు అని ప్రశ్నించింది. క్రికెటర్లకు నటుల కంటే ఎక్కువ గౌరవం ఇస్తారని నటుల కంటే వారే ఎక్కువ అని సంపాదిస్తారని పోస్ట్ చేయడం చాలా బాధపెట్టిందని చెప్పింది. వారు దేశం కోసం ఆడతారు కాబట్టి ఎక్కువగా ప్రేమించబడతారు అని అర్థం చేసుకోగలను.. అలాగే నటులు కూడా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని ఆ విషయం గుర్తుంచుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది.