చాలామందికి, రాత్రిపూట పదేపదే యూరిన్ వస్తూ ఉంటుంది. దాని వలన, నిద్ర కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది నిజానికి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే,. మంచి నిద్ర అవసరం ఒక రాత్రి నిద్ర లేకపోయినా తర్వాత రోజు అనారోగ్యంగా అనిపిస్తూ ఉంటుంది. అసౌకర్యంగా ఉంటుంది. చిరాకుగా ఉంటుంది. నిద్రని పొందితే రోజంతా కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. హెల్దిగా ఉండొచ్చు. చాలామందికి రాత్రి పూట పదేపదే యూరిన్ వస్తూ ఉంటుంది. మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఇలా పదేపదే లేవడం వలన నిద్రకి భంగం కలుగుతుంది.
Advertisement
మానవ శరీరం సహజంగా నిద్రలో తక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. చలికాలం ఇంకా ఎక్కువ యూరిన్ ఉత్పత్తి అవుతుంది. కొంతమంది నిద్రపోయిన తర్వాత ఎక్కువ సార్లు లేవాలి చూస్తుంది. ఫలితంగా నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. పదేపదే రాత్రులు లేవాల్సి వచ్చే సమస్యని నోక్టురియా అని అంటారు. ఈ సమస్యకి కొన్ని మార్గాలు చెక్ పెట్టడానికి అవుతుంది. నిద్ర వేళలు మారడం తగినంత నిద్ర లేకపోవడం వంటి కారణాల వలన తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. నిద్రపోవడానికి ముందు ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటే కూడా ఈ సమస్య ఉంటుంది. ఇలా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం వలన ఎక్కువసార్లు లేవాల్సి వస్తుంది. కెఫిన్ ఉన్న డ్రింక్స్ రాత్రి సమయంలో తాగితే మూత్రవిసర్జన ని పెంచడానికి దారి తీస్తుంది.
Advertisement
కొన్ని మందులు శరీరం నుండి ఎక్కువ ద్రవాలని బయటకి పంపేందుకు కారణం అవుతాయి. అలానే వృద్ధులకి కూడా ఈ సమస్య ఉంటుంది ఇది ఇలా ఉంటే కొంతమందికి మెలుకువ వచ్చిన ప్రతిసారి కూడా టాయిలెట్ కి వెళ్తూ ఉండడం అలవాటు. ఈ అలవాటుని మానుకోవాలి. ఎక్కువగా దీని గురించి ఆలోచించకూడదు. నిద్ర వేళ్ళకి కొన్ని గంటల ముందు లిక్విడ్స్ ని తీసుకోవడం లిమిట్ చేస్తే మంచిది. ముఖ్యంగా ఆల్కహాల్ లేదా కెఫిన్ వున్నా డ్రింక్స్ కి దూరంగా ఉండండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!