Telugu News » Blog » ఉరి తాడుకూ ఓ చరిత్ర ఉందని మీకు తెలుసా ?

ఉరి తాడుకూ ఓ చరిత్ర ఉందని మీకు తెలుసా ?

by Sravan Sunku
Published: Last Updated on
Ads

భారత్‌లో చాలా అరుదైన కేసుల్లోనే దోషులకు ఉరిశిక్షలు పడుతుంటాయి. అంతే అరుదుగా, ఆ శిక్షలు అమలు చేసేందుకు ఉపయోగించే తాడు కూడా దేశంలో ఒక్క చోటే లభిస్తుంది. అదే బిహార్‌లోని బక్సర్ సెంట్రల్ జైలు. గాంధీ హంతకుడు గాడ్సే నుంచి ముంబయి దాడుల్లో దోషిగా తేలిన కసబ్ వరకూ భారత్‌లో ఉరిశిక్షను ఎదుర్కొన్న ఖైదీల చుట్టూ బక్సర్ ఉరితాడే బిగుసుకుంది.

Advertisement

uri thaadu ki unna charitra uri thaadu ki unna charitra[/caption]

ఉరితాడు తయారీ కోసం జే34 అనే నూలును వాడతారు. గతంలో ప్రత్యేకంగా దాన్ని పంజాబ్ నుంచి తెప్పించేవారు. ‘తాడును చేయడం ఎక్కువగా చేత్తో చేసే పనే. దారాలను తాడులా అల్లేందుకు మాత్రమే యంత్రం పనిచేస్తుంది. మొదట 154 నూలు దారపు పోగులుండే ఉండలను తయారు చేస్తారు. ఇలాంటివి ఆరు ఉపయోగించి.. 16 అడుగల పొడవుండే తాడును అల్లుతారు. తాడు తయారీలోని చివరి దశ మొత్తం ప్రక్రియలో అన్నింటి కన్నా ముఖ్యమైంది. బయటనుంచి తాడు తయారు చేసి పంపిస్తారు. అది తీసుకున్న జైలు వాళ్లే ఫినిషింగ్ ప్రక్రియను చేసుకుంటారు. తాడును మృదువుగా, మెత్తగా మార్చడమే ఫినిషింగ్. ఉరి తాడు వల్ల ఎలాంటి గాయాలూ కాకూడదని, కేవలం ప్రాణం మాత్రమే పోవాలని నియమ నిబంధనలు ఉన్నాయి. అందుకే ఫినిషింగ్ చాలా కీలకం.

Advertisement

ఇవి కూడా చదవండి: లండన్ కు మాకాం మారుస్తున్న అంబానీ ఫ్యామిలీ..క్లారిటీ ఇచ్చిన రిల‌య‌న్స్..!

hang rope

hang rope

మొదట్లో ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో ఉరితాడు తయారవుతుండేదని కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ‘మనీలా తాడు’ బాగా ప్రాచుర్యం పొందింది కూడా. ”1880లో బక్సర్ జైలు ఏర్పాటైంది. అప్పుడే బ్రిటీష్ పాలకులు ఇక్కడ ఉరితాడు తయారీ యంత్రం పెట్టి ఉండొచ్చు. అయితే, జైలు రికార్డుల్లో మాత్రం దాని గురించి సమాచారం ఏమీ లేదు. పాత రికార్డులను తిరగేస్తే, ఒక అంచనాకు రావొచ్చుస‌. బ్రిటీష్ పాలన కాలంలో బక్సర్‌ అతిపెద్ద సైనిక స్థావరంగా ఉండేది. ఇక్కడి జైలు కూడా దేశంలో అతిపెద్దదైన జైళ్లలో ఒకటిగా ఉండేది. సహజంగానే అత్యధిక మంది ఖైదీలు ఇక్కడ ఉండేవారు. చాలా కాలం క్రితమే ఇక్కడ పెద్ద పారిశ్రామిక షెడ్‌ను బ్రిటీష్ పాలకులు నిర్మించారు. తాళ్లు మాత్రమే కాదు, ఫినాయిల్, సబ్బుల వంటి చాలా వస్తువులు ఇక్కడ ఖైదీలు తయారుచేస్తుంటారు.

అంతేకాక తాను మృద‌వుగా అవ్వ‌డానికి దానికి అర‌టిపండ్లు రాస్తారు అని కూడా చెప్పుకునేవారు. మన దేశంలో తలారీ వృత్తి కూడా వంశపారంపర్యంగా వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో మీరట్ జైల్లో పవన్ అనే తలారి అధికారికంగా ఈ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం 56 ఏళ్ల వయసున్న పవన్ నెలకి రూ. 3,000 జీతంతో పనిచేస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సమాచారం ప్రకారం భారత్‌లో ఇప్పటివరకూ దాదాపు 1500 మందికి కోర్టులు ఉరిశిక్ష విధించగా, 21 మందికి దాన్ని అమలు చేశారు.

Advertisement

ఇవి కూడా చదవండి: “జై భీమ్” రియ‌ల్ హీరో జ‌స్టిస్ చంద్రు ఎవ‌రు…ఎందుకంత పాపుల‌ర్..?