ప్రభుత్వం యొక్క కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ గూగుల్ క్రోమ్ లో ఎదురయ్యే ఇబ్బందులను ఫ్లాగ్ చేసింది, వీలైనంత త్వరగా బ్రౌజర్‌ను తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోమని వాడకం దారులను కోరింది. సైబర్ అటాకర్ల నుంచి రక్షణ పొందాలంటే అప్ డేట్ తప్పని సరని హెచ్చరించింది. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయడానికి గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను విస్తృతంగా ఉపయోగించే వ్యక్తులను ప్రభుత్వం హెచ్చరించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నుండి ‘అధిక తీవ్రత’ కలిగిన హెచ్చరిక వచ్చింది. సీఈఆర్టీ నివేదిక ప్రకారం.. క్రోమ్‌లో అనేక దుర్బలత్వాలు గుర్తించబడ్డాయి. ఇది వినియోగదారుల సిస్టమ్‌పై ఏకపక్ష కోడ్‌ను అమలు చేయడానికి సైబర్ దాడి చేసేవారి ద్వారా ఉపయోగించబడవచ్చు.
Advertisement
వెర్షన్ 8లో ఉన్న కన్ఫ్యూజన్ కారణంగా ఉన్న ఇబ్బందులన్నీ గుర్తించబడ్డాయి. హ్యాకర్లు వ్యక్తిగత డేటాకు యాక్సెస్ పొందే అవకాశం ఉంది. కంప్యూటర్‌లో మాల్వేర్‌ను చొప్పించే అవకాశం ఉందని తెలిపింది. క్రోమ్ బ్రౌజర్ ను తాజా అప్‌డేట్ చేసుకుని ఇబ్బందులను పరిష్కరించుకోవాలని కోరింది. క్రోమ్ వినియోగ దారులు వీలయినంత త్వరగా అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. లొసుగులను పూడ్చడానికి మరియు రిమోట్‌గా వినియోగదారుల కంప్యూటర్‌లను హ్యాకర్లు నియంత్రించకుండా నిరోధించడానికి మరియు గోప్యతను నిర్ధారించడానికి 22 రకాల భద్రతా పరిష్కారాలను అందించినట్టు సాఫ్ట్‌వేర్ దిగ్గజం తెలిపింది.
Advertisement
2008 వ సంవత్సరంలో తొలిసారిగా క్రోమ్ బ్రౌజర్ వాడకంలోకి వచ్చింది. విండోస్ వాడకం కోసం ఇది రూపుదిద్దుకున్నా.. తరువాత కాలంలో ఇది చాలా రూపాంతరాలు చెందిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు చాలా మందికి ఉపయోగకరంగా ఉన్న క్రోమ్ బ్రౌజర్ వాడకం, సులభంగా ఉండటంతో పాటు, సురక్షితంగా ఉండటం కూడా ఇది విస్తృత వాడకానికి ఒక ప్రధాన కారణం. ముఖ్యంగా ఆండ్రాయిడ్ కోసమే ఇది రూపొందించ బడింది. ఇష్టమైన వార్తా కథనాలను, సైట్ లను త్వరగా చూసేందుకు, అత్యంత ప్రియమైన వాటిని డౌన్ లోడ్ చేసుకునందుకు కోట్లాది మంది ఈ క్రోమ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నారు.