ఇండస్ట్రీలో ఎలాంటి బాగ్రౌండ్ లేకుండా వచ్చి మాస్ మహారాజ్ గా ఎదిగిన హీరో రవితేజ. తన నటన ఎనర్జీ తో రవితేజ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల ఖిలాడి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. త్వరలో రామా రావు ఆన్ డ్యూటీ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Advertisement
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామన్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు స్టార్ ల తనయులు ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా మారిపోయారు. కాగా ఇప్పుడు రవితేజ కుమారుడు మహాధన్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అనిల్ రావి పూడి రవితేజ కాంబినేషన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాలో మహాదన్ నటించాడు.
Advertisement
కాగా ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లోనే మహాదన్ పరిచయం అవ్వబోతునట్టు టాక్ వినిపిస్తోంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుంది టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంతే వెయిట్ చేయాల్సిందే.
Also read : శ్రీశైలంలో వాహనాలపై బొమ్మలు ఎందుకు వేస్తారో తెలుసా..?