Home » కన్నడ స్టార్స్ రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి హీరోలు అయ్యేందుకు అంతలా కష్టపడ్డారా…! చివరికి థియేటర్ ముందు టికెట్లు….?

కన్నడ స్టార్స్ రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి హీరోలు అయ్యేందుకు అంతలా కష్టపడ్డారా…! చివరికి థియేటర్ ముందు టికెట్లు….?

by AJAY
Ad

ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న సినిమాలు పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాయి. కేజీఎఫ్ సినిమాతో కన్నడ సినిమా స్టామినాను ప్రశాంత్ నీల్ దేశానికి పరిచయం చేశాడు. అంతేకాకుండా ఈ ఏడాది ఆ ఇండస్ట్రీ నుండి మరో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి చార్లీ సినిమా కాగా మరొకటి కాంతార సినిమా.

Advertisement

కాంతార సినిమా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 60 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది. కాంతార సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాలో హీరోగా నటించారు. అదేవిధంగా చార్లీ సినిమా సైతం తక్కువ బడ్జెట్ తో తెరకెక్కగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు.

Advertisement

అయితే వీరిద్దరూజు అన్నదమ్ములు అని చాలామంది అనుకుంటున్నారు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా కిరిక్ పార్టీ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కంటే ముందు రక్షిత్, రిషబ్ శెట్టి కెరియర్లో ఎదగడానికి ఎన్నో కష్టాలు అనుభవించారన్న సంగతి చాలామందికి తెలియదు. ఈ సినిమా కంటే ముందు రక్షిత్ శెట్టి క్లాప్ బాయ్ గా పనిచేయగా రిషబ్ శెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారట.

ఆ తర్వాత రిషబ్ శెట్టి కి ఓ సినిమాను దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో రక్షిత శెట్టి నే హీరోగా పెట్టి తెరకెక్కించాడు. ఆ సినిమా పేరు రిక్కీ కాగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా థియేటర్లలో ఆడుతున్న సమయంలో వచ్చి పోయే వారికి ఫ్రీగా టికెట్లను ఇచ్చేవారట. సినిమా చూడాలని నచ్చితే మరికొందరికి చెప్పాలని కోరేవారట. అలాంటి సిచువేషన్ నుండి ప్రస్తుతం ఇద్దరు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సాధించారు.

Visitors Are Also Reading