Home » త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య ఎవరో తెలుసా…? ఆమె ఏం చేస్తారంటే…!

త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య ఎవరో తెలుసా…? ఆమె ఏం చేస్తారంటే…!

by AJAY
Published: Last Updated on
Ad

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌న ప‌దునైన డైలాగుల‌తో మొద‌ట ర‌చ‌యిత‌గా ప‌రిచ‌యం అయ్యాడు. ఆ త‌ర‌వ‌తా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. వ‌రుస గా హిట్స్ అందుకుంటూ స్టార్ డైరెక్ట‌ర్ గా ఎదిగాడు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జులాయి, అత‌డు, అత్తారింటికి దారేది, అల వైకుంఠ‌పురంలో సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిలిచాయి.

ఇక అల వైకుంఠ‌పురంలో సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింద‌ని త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఆ సినిమా ఆడియో ఫంక్ష‌న్ లో చెప్పారు. త‌న భార్య సౌజ‌న్యను సాధార‌ణంగా తాను ఎప్పుడూ షూటింగ్ ల‌కు తీసుకువెళ్ల‌లేద‌ని చెప్పాడు.

Advertisement

Advertisement

కానీ అల వైకుంఠ‌పురంలో సినిమాలోని సామ‌జ‌వ‌ర‌గ‌న‌మ‌న పాట షూటింగ్ కోసం పారిస్ వెళ్లామ‌ని అప్పుడు త‌న భార్య సౌజ‌న్య‌ను కూడా వెంట తీసుకువెళ్లాన‌ని త్రివిక్ర‌మ్ తెలిపారు. కానీ రెండు రోజుల‌కే త‌న భార్య సౌజ‌న్య నీర‌సించిపోయింద‌ని అక్క‌డ ఉండ‌లేక త‌న‌ను వ‌దిలేసి ఇంటికి వ‌చ్చేసిందని చెప్పారు.

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సౌజ‌న్య‌ను 2002లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు సంతానం ఉన్నారు. త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి క్లాసిక‌ల్ డ్యాన్సర్ కావ‌డం విశేషం. ఇటీవ‌లే ఆమె డ్యాన్స్ ప్రోగ్రాం కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌రయ్యారు. త్రివిక్రమ్ సౌజన్య లది పెద్దలు కుదిర్చిన వివాహం. సౌజన్య విదేశాల్లో కూడా క్లాసికల్ డ్యాన్స్ షోలు చేస్తుంటారు. అంతే కాకుండా సౌజ‌న్య ప్ర‌ముఖ లిరిక్స్ రైట‌ర్ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి స్వ‌య‌నా మేన‌కోడ‌లు అవుతారు.

Visitors Are Also Reading