నందమూరి ఫ్యామిలీ మరో యువ హీరోని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి ఫ్యామిలీలో వరస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనికి కారణం ఏంటో తెలియదు కానీ, అంత పెద్ద ఫ్యామిలీ మెల్లి మెల్లిగా ఖాళీ అయిపోతుంది. ఈ తరుణంలోనే నందమూరి తారకరత్న మరణించడం నందమూరి ఫ్యామిలీని మరోసారి కుదుపుకు గురి చేసింది. నందమూరి లోకేష్ మొదలు పెట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొని అస్వస్థత గురై గుండెపోటు వచ్చి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో 23 రోజులుగా చికిత్స పొందుతూ చివరికి తన నిండు ప్రాణాలు విడిచారు.
Advertisement
దీంతో నందమూరి ఫ్యామిలీ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. చివరికి ఆయన పార్టీవ దేహాన్ని హైదరాబాదులోని తన సొంత ఇంటికి తీసుకువచ్చారు. కానీ చివరి క్షణం వరకు తల్లిదండ్రులు రాకపోవడంతో చాలామంది వివిధ రకాలుగా భావించారు. కానీ చివరి కి తల్లిదండ్రులు కడసారి కొడుకును చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అలాంటి తారక రత్న తండ్రి మోహన్ కృష్ణ గురించి చాలామందికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
మోహన కృష్ణ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఆయన చిన్నతనం నుంచిసినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. తన తండ్రిలా నటన వైపు కాకుండా సినిమాటోగ్రఫీ వైపు వెళ్లారు. మోహనకృష్ణ పలు స్టార్ హీరోల సినిమాలకు కెమెరామెన్ గా పనిచేశారు. అంతేకాక సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఒక వైపు చదువుకుంటూ నే కెమెరామెన్ గా ఎదిగారు. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాకు మొదట అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేశారు. దీని తర్వాత పలు చిత్రాలకు పని చేసిన తారకరత్న తండ్రి ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అనురాగ దేవత చిత్రంతో సినిమాటోగ్రాఫర్ గా మారారు. చివరగా తనయుడు తారకరత్న హీరోగా నటించిన వెంకటాద్రి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఇక అప్పటినుండి తండ్రి ఎన్టీఆర్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు మోహనకృష్ణ.
also read: