Home » NTR కు ఫస్ట్ పెట్టాల‌నుకున్న పేరేంటి? NTRను ద‌త్త‌త తీసుకున్నారా? NTR ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

NTR కు ఫస్ట్ పెట్టాల‌నుకున్న పేరేంటి? NTRను ద‌త్త‌త తీసుకున్నారా? NTR ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

by Azhar
Ad

న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా , నిర్మాత‌గా స‌క్సెస్, రాజ‌కీయాల్లో పెను మార్పుల‌కు కెరాఫ్ అడ్ర‌స్ , అనేక సంక్షేమా ప‌థ‌కాల‌ను రూపొందించిన విజ‌న్…టూకీగా ఇది NTR గారి ఇంట్ర‌డ‌క్ష‌న్. కానీ ఇదంతా అంత ఈజీగా జ‌రిగిన తంతుకాదు మ‌రీ ముఖ్యంగా సినిమాల్లోకి రావ‌డానికి ఆయ‌న అనేక క‌ష్టాలు ప‌డ్డాడు.

NTRకు మొద‌ట‌గా అనుకున్న పేరు :
NTR 1923 మే 28న‌ కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు.త‌న కొడుకుకు కృష్ణ అనే పేరు పెట్టాల‌నుకుంది త‌ల్లి వెంక‌ట రామ‌మ్మ కానీ మేన‌మామ తార‌క రాముడు అని పెట్టాడు రాముడు కాస్త రామారావుగా మారి నంద‌మూరి తార‌క రామారావు అయ్యింది.

Advertisement

NTRను ద‌త్తత‌కు ఇచ్చారా?
అవును NTR ను మేన‌మామ ద‌త్త‌త తీసుకున్నాడు. ల‌క్ష్మ‌మ్మ అన్న‌య్య అయిన అత‌నికి పిల్ల‌లు లేక‌పోవ‌డంతో NTR ను ద‌త్త‌త తీసుకున్నాడు.

Advertisement

Also Read: ఈమె ఎవ‌రు? NTRకు ఈమెకు లింకేటి? అప్ప‌టి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్తేంటి?

NTR చ‌దువులో ఎలా ఉండేవారు?
NTR చాలా బాగా చ‌దివేవారు. అందుకే మద్రాసు సర్వీసు కమిషన్ నిర్వ‌హించిన ప‌రీక్ష‌ను 1100 మంది రాస్తే అందులో 7వ ర్యాంక్ సాధించి మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగాన్ని పొందాడు. చిత్ర‌లేఖనంలో కూడా రాష్ట్ర స్థాయి ప్రైజులు సాధించారు.

NTR ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?
ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు NTR ఫొటోను LV ప్రసాద్ దగ్గర చూసి అతనిని మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో హీరోగా ఎంపిక చేసాడు. రెమ్యున‌రేష‌న్ గా NTRకు వెయ్యి నూటపదహార్ల చెక్ ఇచ్చాడు.కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు.

Also Read: Jr. NTR & మంచు మ‌నోజ్ ల మ‌ధ్య 5 పోలికలు.

Visitors Are Also Reading