టాలీవుడ్ లోని అందగాళ్లలో శోభన్ బాబు కూడా ఒకరు. శోభన్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా శోభన్ బాబుకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఎవరినైనా అందం గురించి పోలిస్తే నువ్వేమైనా మహేశ్ బాబు లా ఉన్నావా అంటారు. అలానే ఒకప్పుడు ఎవరినైనా అందం గురించి పోలిస్తే నువ్వేమైనా శోభన్ బాబు అనుకుంటున్నావా అని అనేవారు అంటే శోభన్ బాబు క్రేజ్ ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
Advertisement
శోభన్ బాబు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణలకు సమానంగా పోటీ ఇచ్చేవారు. ఆయనకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఇక శోభన్ బాబు సినిమా అవకాశాల కోసం వెతికేటప్పటికి ఆయనకు వివాహం కూడా జరిగిపోయింది. దాంతో కుటుంబంతో కలిసి మద్రాస్ లో ఓ అద్దె ఇంట్లో ఉంటూ శోభన్ బాబు సినిమా ఆఫర్ ల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరిగేవారు. ఇక శోభన్ బాబు నటించినన్ని రోజులు హీరోగా నటించారు.
Advertisement
ఆ తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పారు. అతడు సినిమాలో నాజర్ నటించిన పాత్ర కోసం మొదట ఆయన్నే సంప్రదించారట. కానీ తనను జనాలు ఎప్పటికీ సోగ్గాడిగానే గుర్తుపెట్టుకోవాలని చెప్పి పూర్తిగా సినిమాకు దూరంగా ఉన్నారట. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ప్రతిహీరో ఇంటి నుండి వారసులు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కానీ శోభన్ బాబు నటవారసులుగా మాత్రం ఎవరూ ఎంట్రీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే శోభన్ బాబు భార్య పేరు శాంతకుమారి కాగా వీరికి ఓ కుమారుడు ముగ్గురు కూతుళ్లు సంతానం ఉన్నారు. శోభన్ బాబు కుమారుడి పేరు కరుణశేష్ ఆయన కూడా అచ్చం శోభన్ బాబు లానే ఉంటారు. కానీ ఆయనకు సినిమాల పై ఆసక్తి లేకపోవడం వల్ల ఇండస్ట్రీలోకి రాలేదట. ఇక ఆయన ప్రస్తుతం వివిధ వ్యాపారాలతో బిజీగా ఉన్నారు.